`సలార్‌` ట్రైలర్‌కి టైమ్‌ కుదిరింది.. బుకింగ్స్ ఓపెన్‌.. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్ జాతర షురూ

Published : Nov 21, 2023, 08:05 PM ISTUpdated : Nov 21, 2023, 08:21 PM IST
`సలార్‌` ట్రైలర్‌కి టైమ్‌ కుదిరింది.. బుకింగ్స్ ఓపెన్‌.. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్ జాతర షురూ

సారాంశం

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` మేనియా ప్రారంభమైంది. ఈ మూవీ ట్రైలర్‌ డిసెంబర్‌ 1న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌కి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` మూవీ విడుదలకు ఇంకా నెల రోజులు ఉంది. దీంతో కౌంట్‌ డౌన్‌ ప్రారంభించింది యూనిట్‌. కరెక్ట్ గా నెల రోజులు ఉన్న నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్‌ చేసింది. నార్త్ అమెరికాలో ఈ రోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించిన ఓపెన్‌ చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ డేట్‌ని కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్‌కి టైమ్‌ని ఫిక్స్ చేసింది. 

`సలార్‌` ట్రైలర్‌ని డిసెంబర్‌ 1 సాయంత్రం విడుదల చేయబోతున్నట్టు తెలిసింది. సాయంత్రం ఏడు గంటల 19 నిమిషాలకు ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నామని వెల్లడించింది. అంతేకాదు పది రోజు కౌంట్‌ డౌన్‌ ని కూడా జస్ట్ ప్రారంభించింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు మరింత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. `సలార్‌`లో ప్రభాస్‌ విశ్వరూపాన్ని చూసేందుకు వారంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

`కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన `సలార్‌` మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగాన్ని `సలార్‌ః సీజ్‌ఫైర్‌` పేరుతో విడుదల  చేస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సలార్‌గా కనిపించబోతున్నారు. ఆయన రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకుజోడీగా శృతి హాసన్‌ హీరోయిన్‌గా చేస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. 

అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. సెప్టెంబర్‌లోనే రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ప్రకటించింది. కానీ సీజీ వర్క్ కంప్లీట్‌ కాకపోవడం, అనుకున్న విధంగా రాకపోవడంతో సినిమాని వాయిదా వేశారు. ఇప్పుడు పక్కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 22న సినిమాని భారీగా రిలీజ్‌ చేయబోతున్నారు. బాలీవుడ్‌లో షారూఖ్‌ నటించిన `డంకీ`చిత్రం కూడా ఒక్క రోజు ముందుగా రాబోతుంది. దీంతో బాక్సాఫీసు వద్ద ఈ రెండు చిత్రాలు మధ్య భారీ ఫైట్‌ ఉండబోతుందని చెప్పొచ్చు.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?