Salaar Teaser.. యుద్ధరంగంలో ప్రత్యర్థులపై ప్రభాస్‌ వీరంగం.. టీజర్‌ గూస్‌బంమ్స్..

Published : Jul 06, 2023, 05:25 AM ISTUpdated : Jul 06, 2023, 06:27 AM IST
Salaar Teaser.. యుద్ధరంగంలో ప్రత్యర్థులపై ప్రభాస్‌ వీరంగం.. టీజర్‌ గూస్‌బంమ్స్..

సారాంశం

ప్రభాస్‌ అభిమానులు, సలార్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. `సలార్‌` టీజర్‌ వచ్చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని ఈ ఉదయం విడుదల చేశారు.

ప్రభాస్‌ అభిమానులు, సలార్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. `సలార్‌` టీజర్‌ వచ్చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని ఈ ఉదయం విడుదల చేశారు. ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఈ టీజర్‌ సాగడం విశేషం. ఇందులో ఓ  ఫ్యాక్టరీలో వందల మంది ఒకరిని చంపేందుకు తుపాకులతో చుట్టుముడుతుంటాడు. అయితే ఓ వృద్ధుడు.. వారికో కథ చెబుతాడు. 

`సింహాం, టైగర్‌, చిరుతపులి, ఎలిఫెంట్‌.. వెరీ డేంజరస్‌.. కానీ అది జురాసిక్ పార్క్ లో కాదు. ఆ పార్క్ లో ఒక .. ` అంటూ ప్రభాస్‌ని చూపించడం విశేషం. ఇక కత్తులతో ప్రత్యర్థులపై వీరంగం సృష్టించారు ప్రభాస్‌. యుద్ధ రంగంలో ఆయన విరుచుకుపడ్డారు. దీనికితోడు గూస్‌బంమ్స్ తెప్పించే బీజీఎం.. ఇందులో హైలైట్‌గా నిలిచింది. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్‌ అనే చెప్పాలి. `కేజీఎఫ్‌` తరహాలోనే టీజర్‌ కూడా సాగడం విశేషం. ఆద్యంతం యాక్షన్‌, ఎలివేషన్‌తో ఈ టీజర్‌ సాగడం మరో విశేషం ప్రస్తుతం టీజర్‌ ట్రెండ్‌ అవుతుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందని ప్రకటించారు మేకర్స్. `పార్ట్ 1ః కాల్పుల విరమణ` అంటూ ప్రకటించారు. టీజర్‌ చివర్లో విలన్‌ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమార్‌ని చూపించడం విశేషం. టీజర్‌ మొత్తం బ్లాక్‌ టోన్‌లో సాగింది. `కేజీఎఫ్‌` టోన్‌లోనే `సలార్‌` టీజర్‌ కూడా ఉండటం విశేషం. మార్నింగ్‌ 5.12కి టీజర్‌ విడుదల చేయడానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. `కేజీఎఫ్‌ 2` మార్నింగ్‌ 5.12కి ముగుస్తుంది. సినిమాలో టైమింగ్‌ ప్రకారం. `సలార్‌` టీజర్‌ని అదే సమయంలో రిలీజ్‌ చేయడంతో దానికి దీనికి సంబంధం ఉందని, దానికి కొనసాగింపుగానే ఈ సినిమా సాగుతుందనే సాంకేతాలిచ్చారు మేకర్స్. 

ఇందులో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా, పృథ్వీ రాజ్‌ సుకుమార్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా  టీజర్‌ని  కేవలం ఒకేలా భాషలో విడుదల చేశారు. ఇంగ్లీష్‌ డైలాగ్‌లతోనే టీజర్‌ సాగడం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు