Salaar Cease Fire : అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘సలార్’ కేక పుట్టిస్తోందిగా.. డిటేయిల్స్

By Asianet News  |  First Published Nov 26, 2023, 5:06 PM IST

యూఎస్ఏలో ‘సలార్’ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ప్రారంభమై అందరగొడుతున్నాయి. అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే సాలిడ్ మార్క్ కు రీచ్ కాబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)   నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’. ఈ భారీ ఫిల్మ్ రెండు భాగాలుగా రాబోతోంది. అన్ని మంచిగా ఉంటే గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసేది. కానీ మరింత బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరో ఇరవై ఐదు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 

తాజాగా అప్డేట్ ప్రకారం... సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో యూఎస్ఏలో రికార్డు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ కు ఇంకా 25 రోజుల సమయం మిగిలి ఉన్నా..  యూనైటెడ్ స్టేట్స్ లోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలు పెట్టాయి. ముందస్తు టికెట్ రిజర్వేషన్ కు వీలు కల్పించింది. దీంతో సలార్ అడ్వాన్డ్స్ టికెట్ సేల్స్ లో దుమ్ములేపుతోంది. 

Latest Videos

undefined

ఇప్పటికే సలార్ కు 225కే డాలర్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్లు అమ్ముడు పోయాయి. ప్రీమియర్ షోలకే ఇంత కలెక్ట్ చేయడం విశేషం. ఇంకా సేల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 1 మిలియన్ డాలర్ వరకు టికెట్ సేల్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టేనని అంటున్నారు. 

ఇక Salaar Trailer ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ వచ్చి సోషల్ మీడియాను తగలెట్టేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ ఎలాంటి సంచనాలు క్రియేట్ చేయబోతుందోనని అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రవి బర్రూర్ సంగీతం ఇస్తున్న ఈ భారీచిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

click me!