`ఆదికేశవ, కోట బొమ్మాళి పీఎస్‌, సౌండ్‌ పార్టీ`.. ఏ సినిమా కలెక్షన్లు ఎంత?

Published : Nov 26, 2023, 04:17 PM IST
`ఆదికేశవ, కోట బొమ్మాళి పీఎస్‌, సౌండ్‌ పార్టీ`.. ఏ సినిమా కలెక్షన్లు ఎంత?

సారాంశం

ఈ శుక్రవారం ప్రధానంగా ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ప్రధానంగా `ఆదికేశవ`, `కోట బొమ్మాళి`, `సౌండ్‌ పార్టీ` చిత్రాలున్నాయి. వీటిలో ఏది హిట్‌ , ఏది ఫట్‌ అనేది చూస్తే,   

పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా చిన్న సినిమాల జోరు సాగుతుంది. ఈ శుక్రవారం కూడా చాలా వరకు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన `ఆదికేశవ`, శ్రీకాంత్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన `కోట బొమ్మాళి పీఎస్‌` చిత్రాలతోపాటు `బిగ్‌ బాస్‌`5 విన్నర్‌ వీజే సన్నీ నటించిన `సౌండ్‌ పార్టీ` చిత్రాలున్నాయి. 

ఇందులో వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల నటించిన `ఆదికేశవ` మూవీకి ప్రారంభం నుంచి నెగటివ్‌ టాక్ వచ్చింది. రెగ్యూలర్ కమర్షియల్‌ మూవీలా ఉండటం దీనికి పెద్ద మైనస్‌. కొత్త కంటెంట్‌ లేకపోవడంతో ఆడియెన్స్ ఎంకరేజ్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన ఈ మూవీ కి తొలి రోజు సుమారు రూ. 95లక్షల గ్రాస్‌ వచ్చింది.  ఇక రెండో రోజులు 70 లక్షలు దాటింది. ఓవర్సీస్‌లో మరో 20 లక్షలకుపైగా వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లో ఇది సుమారు రెండు కోట్ల గ్రాస్‌, కోటి షేర్‌ సాధించింది. సుమారు తొమ్మిది కోట్ల బిజినెస్ తో రంగంలోకి దిగిన ఈ మూవీకి బాక్సాఫీసు వద్ద ఆశించని స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఇది ఫ్లాప్‌ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. 

ఇక శుక్రవారం వచ్చిన చిత్రాల్లో `కోటబొమ్మాళి పీఎస్‌` మూవీకి మంచి స్పందన లభిస్తుంది. శ్రీకాంత్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఈమూవీలో నటించారు. ఒక క్రైమ్‌ ప్రధానంగా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం రాజకీయాలను, వ్యవస్థని, ప్రజల తీరుతెన్నులను ఆవిష్కరించేలా ఈ మూవీ సాగింది. ఆద్యంతం ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఎత్తులకు పై ఎత్తులు ఆకట్టుకున్నాయి. సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. 

ఈ సినిమాకి మొదటి రోజు 1.75కోట్ల గ్రాస్‌ వచ్చింది. రెండో రోజు పెరిగింది. శనివారం ఈ సినిమా 2.5కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ 4.25కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండు కోట్లకుపైగానే షేర్‌ వచ్చింది. ఇక ఈ ఆదివారం వచ్చే కలెక్షన్లతో ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని తెలుస్తుంది. మరోరెండు కోట్లు వస్తే సేఫ్‌ అంటున్నారు. ఈ చిత్రం తొలి వీకెండ్‌తోనే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని తెలుస్తుంది. ఇక మండే నుంచి లాభాలే అని చెప్పొచ్చు. 

మరోవైపు శుక్రవారం విడుదలైన చిత్రాల్లో `బిగ్‌ బాస్‌ 5` ఫేమ్‌ వీజే సన్నీ నటించిన `సౌండ్‌ పార్టీ` కూడా ఉంది. సంజయ్‌ శేరి దర్శకత్వం వహించిన ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఫన్‌  బాగా వర్కౌట్‌ అయ్యింది. ఆడియెన్స్ నుంచి పాటివ్‌ టాక్‌ వచ్చింది. కామెడీ కొంత రొటీన్‌గా ఉండటం సినిమాకి మైనస్‌. టాక్‌ పరంగా బాగానే ఉన్నా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. పెద్ద స్టార్‌ కాస్ట్ లేకపోవడం పెద్ద మైనస్‌. ఇక మొత్తంగా శుక్రవారం వారం విడుదలైన చిత్రాల్లో `కోట బొమ్మాళి` విజయవంతంగా రన్‌ అవుతుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే