కేరళలో ‘సలార్’ను రిలీజ్ చేస్తున్నది ఆయనే? మరోసారి రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసిన టీమ్

By Asianet News  |  First Published Nov 6, 2023, 5:42 PM IST

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’ రిలీజ్ కు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో కేరళలో సినిమాను ప్రముఖ నటుడు రిలీజ్ చేస్తున్నారు. 
 


‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబాలే ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్, భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ (Salaar Cease Fire). సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తుండటంతో చిత్రంపై వరల్డ్ వైడ్ గా సినిమాకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ టీజర్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. 

ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం మేకర్స్ వాయిదా వేశారు. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మెన్నటి వరకు మూవీ మళ్లీ వాయిదా పడబోతుందని వచ్చిన రూమర్లను కూడా కొట్టిపారేస్తూ తాజాగా ఓ కీలకమైన అప్డేట్ ను అందించారు. ఇప్పటికే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. 

Latest Videos

undefined

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏరియా వైజ్ గా సినిమా డిస్ట్రిబ్యూషన్స్ ను పూర్తి చేస్తున్నారు. నైజాంలో మైత్రీ మూవీస్ వారు రూ.65 కోట్లకు సొంతం చేసుకున్నారు. తెలుగు స్టేట్స్ రూ.165 కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో కేరళలో ఈ భారీ ప్రాజెక్ట్ ను మలయాళ స్టార్ హీరో, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. Prithviraj Sukumaran కు కేరళలో మంచి పట్టుఉండటంతో డిస్ట్రిబ్యూషన్  బాధ్యతలను అప్పగించారు. 

మరోవైపు ఫృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’లో విలన్ గా నటిస్తుండటం విశేషం. ఆయన నటించిన చిత్రాన్నే డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. చిత్రంలో హీరోయిన్ శృతిహాసన్ కథానాయిక. జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. రవి బర్సూర్ సంగీతం అందించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత విజయ్ కిరగందూర్ రూ.250 కోట్ల పెట్టబడితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

We are delighted to partner with to present in the vibrant state of 𝐊𝐞𝐫𝐚𝐥𝐚!
Get ready for an unforgettable cinematic experience. … pic.twitter.com/MsXzjTmkDx

— Salaar (@SalaarTheSaga)
click me!