`సలార్‌ 2` షూటింగ్‌ కి తొందరపడుతున్న ప్రశాంత్‌ నీల్‌.. కారణం ఏంటంటే?

Published : Feb 03, 2024, 12:13 PM ISTUpdated : Feb 03, 2024, 12:14 PM IST
`సలార్‌ 2` షూటింగ్‌ కి తొందరపడుతున్న ప్రశాంత్‌ నీల్‌.. కారణం ఏంటంటే?

సారాంశం

`సలార్‌` పెద్ద విజయం సాధించడంతో `సలార్‌ 2`పై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్‌ ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. 

ప్రభాస్‌ నటించిన `సలార్‌` మూవీ ఇండియన్‌ బాక్సాఫీసు దుమ్ములేపింది. ఈ మూవీ `డుంకీ` వంటి గట్టి పోటీ మధ్య ఏడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. విశేష ఆదరణ పొందింది. చాలా వరకు బ్రేక్‌ ఈవెన్‌ దాటింది. తొలి పార్ట్ పెద్ద హిట్‌ కావడంతో రెండో భాగంపై అంచనాలున్నాయి. పైగా మొదటి భాగంలో అసలు కథే లేదు, అసలు కథ పార్ట్ 2లో ఉండబోతుంది. అందుకే `సలార్‌2`పై హైప్‌ ఏర్పడింది. `ఖాన్సార్‌` హిస్టరీని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చాలా పెద్ద స్కేల్‌లో చెప్పబోతున్నారు. 

`సలార్‌`లో రివీల్‌ చేసిన పాయింట్ల ఆధారంగా చాలా కథ ఉందని అర్థమవుతుంది. ఇది మరో రెండు పార్ట్ లకు సరిపోయే కథ ఉందని తెలుస్తుంది. కానీ మెయిన్‌గా సెకండ్‌ పార్ట్ లో ఏం చూపించబోతున్నామో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ప్రభాస్‌ నటించిన దేవా పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌ని రివీల్‌ చేశాడు. శౌర్యాంగుల వంశానికి చెందిన నాయకుడు అని తేల్చి చెప్పారు. 

శివ మన్నార్‌ తర్వాత అధికారం శౌర్యాంగులకు దక్కాలి. కానీ రాజమన్నార్‌ కుట్ర చేసి తను లాక్కున్నాడు. శౌర్యాంగులను అంతం చేశాడు. కానీ శౌర్యాంగుల వంశానికి చెందిన దేవా రహస్యంగా జీవిస్తుంటాడు. స్నేహితుడు వరద మన్నార్‌కి సహాయం చేసి అధికారం కట్టపెడతాడు. కానీ ఈ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. ఆ గొడవ ఎందుకు వచ్చింది. దేవా ఎందుకు దూరంగా ఉంటున్నాడు? ఖాన్సార్‌ని తన వశం చేసుకోవడం కోసం ఏం చేయబోతున్నాడనేది `సలార్‌ 2`లో ఉండబోతుంది. అదే సమయంలో దేవా తండ్రి ఎవరనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఇలా అనేక అంశాలు పార్ట్ 2పై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. 

ఇదిలా ఉంటే `సలార్‌ 2` కోసం ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు చూడాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండో పార్ట్ ని తీసుకొచ్చేందుకు ఆతృతగా ఉన్నాడట. ఆయన వెంటనే ఈ మూవీని ప్రారంభించాలనుకుంటున్నారట. దీనికి మరో కారణం కూడా ఉంది. `సలార్‌` కోసం వేసి సెట్‌ ఇప్పుడు డ్యామేజ్‌ అయ్యే పరిస్థితిలో ఉంది. అది పాడవుతే మళ్లీ వేసుకోవాల్సి వస్తుంది. సహజత్వం పోతుంది, లింక్‌ మిస్‌ అవుతుంది. దీంతో వెంటనే `సలార్‌ 2` షూటింగ్‌ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు సమాచారం. 

లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని ఈ సమ్మర్‌లోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో `సలార్‌ 2` స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్‌ చేసే పనిలో ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమ్మర్ ఏప్రిల్‌, మేలో పార్ట్ 2ని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే ఏడాది రిలీజ్‌ ఉంటుందని సమాచారం. ఇక ఇందులో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శృతి హాసన్‌, జగపతిబాబు, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు