ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కు రిలీజ్ సమస్యలు ఎదురౌతున్నాయి.
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ చిత్రం మత కల్లోల కథాంశం ప్రధానం. ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కు రిలీజ్ సమస్యలు ఎదురౌతున్నాయి.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని కువైట్ లో బ్యాన్ చేసారు. కువైట్, కథర్ సినిమాల రిలీజ్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి. అక్కడ సినిమాలు బ్యాన్ చేయడానికి కారణం అందులో ఉన్న కంటెంట్. ఆయా దేశాల్లో సినిమాలపై చాలా ఆంక్షలు ఉంటాయి. ఏ మాత్రం కంటెంట్ తేడాగా ఉన్నా వెంటనే దాన్ని బ్యాన్ చేస్తుంటారు అక్కడి ప్రభుత్వాలు.ఈ క్రమంలో లాల్ సలాం చిత్రం లో సెన్సిటిల్ కాన్సెప్టు ఇందని, హిందూ,ముస్లిం ఘర్షణలు కు సంభందించింది కావటంతో బ్యాన్ చేసినట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్ లో కూడా ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు సెన్సార్ కష్టమే అంటున్నారు.
ఇక రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ తో అభిమానులు, ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదే సమస్యగా గా మారింది. అదేమిటంటే.., లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
మొదట ఈ సినిమాకు రజనీ ఒప్పుకున్నది కేవలం తన కూతురు దర్శకత్వం అనే అనేది నిజం. తమ కూతురు సినిమా కాకపోతే రజనీ గెస్ట్ రోల్ లో చేయరు. కానీ టీజర్ రిలీజైన తర్వాత ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది. ఈ టీజర్ లోని డైలాగులు వైరల్ అయ్యాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని టీవిలో చూసి ఉంటారు. రేడియోలో విని ఉంటారు. కానీ డైరెక్ట్ గా చూశారా.. అంటూ క్రికెట్ మ్యాచ్‌తో ఈ టీజర్ ప్రారంభకాగా, ఇది స్పోర్ట్స్ డ్రామాలా కనిపిస్తుంది, అయితే ఈ మ్యాచ్ వలన హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్ అనే స్పెషల్ రోల్‌తో అలరించనున్నాడు. అయితే మొదటి నుంచి రజనీ గెస్ట్ రోల్ అని చెప్పినా ఇప్పుడు బిజినెస్ జరిగే సమయంలో రజనీ సినిమా అన్నట్లుగానే కొంటున్నారట.
ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యే ‘లాల్ సలాం’సినిమాలో రజనీ కనపడేది కేవలం అరగంటే అని తెలిసింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ‘‘లాల్ సలాం’ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్.