కొత్త సంవత్సరం లో "నేనోరకం"

Published : Dec 31, 2016, 10:02 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కొత్త సంవత్సరం లో "నేనోరకం"

సారాంశం

కొత్త సంవత్సరంలో నేనోరకం అంటున్న సాయిరాం శంకర్ నేనోరకం మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న శరత్ కుమార్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది .ఈ కొత్త సంవత్సరంలో ఆడియోన్స్ ను అలరించేలా " నేనోరకం " ఉంటుందని చిత్ర బృందం కాన్పిడెంట్ గా ఉంది.

 ఈసందర్బంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనోరకం అనే టైటిల్ మా ఈ  సినిమాకు కరెక్ట్ గా యాప్ట్. ఆడియెన్స్ ను అలరించటంతొ పాటు , ఆలొచింపచెసెలా ,కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో  థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కించబడిన చిత్రమిదన్నారు..

శరత్ కుమార్ మాట్లాడుతూ..2017 లొ అందరికి మంచి జరగాలని ఆశిస్తూ.. హ్యాపి న్యూ ఇయర్. ఈ మధ్య కాలంలో సౌత్ లో అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.నేనోరకం  సైతం అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ.  దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్. సినిమా టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ.. నూతన  సంవత్సరం ప్రారంభాన అందరికి శుభాకాంక్షలు.  "నేనోరకం" టైటిల్ కు తగ్గట్టుగానే  సరికొత్త ట్రీట్ మెంట్ తో సినిమా రూపొందించటం జరిగింది.  సాయిరామ్ శంకర్  -శరత్ కుమార్ ల నటన ,వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను కలుగచేస్తాయన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... కొత్త సంవత్సరంలొ మా సంస్థ ద్వారా ఓ సరికొత్త కమర్షియల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. త్వరలొనె పాటలను విడుదల చెయనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా మరియు టైటిల్ ను  సిద్దం చేయటం జరిగింది. తెలుగుతో పాటు తమిళ్ లో సైతం ఈ సినిమాను విడుదల చెస్తామన్నారు..

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2: అతిక్ అహ్మద్‌కి ఉగ్రవాదులతో లింక్‌లు.. సంచలన నిజాలు బయటపెట్టిన డీజీపీ, వామ్మో ఇంత జరిగిందా ?
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం