సైఫ్‌, కరీనా తన రెండో కుమారుడిని ఏ పేరుతో పిలుస్తున్నారో తెలుసా?

Published : Jul 10, 2021, 08:20 AM IST
సైఫ్‌, కరీనా తన రెండో కుమారుడిని ఏ పేరుతో పిలుస్తున్నారో తెలుసా?

సారాంశం

 కరీనా, సైఫ్‌ల రెండో కుమారుడిని ఏమని పిలుచుకుంటున్నారనేది సస్పెన్స్ గా మారినే నేపథ్యంలో తాజాగా కరీనా తండ్రి రణ్‌ధీర్‌ కపూర్‌ ఓపెన్‌ అయిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో కరీనా రెండో కుమారుడికి పెట్టుకున్న పేరేంటో రివీల్‌ చేశాడు. 

బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ ఇటీవల రెండో కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు నెలలవుతున్న ఇంకా అబ్బాయికి పేరు విషయంలో క్లారిటీ లేదు. కరీనా, సైఫ్‌ అతన్ని ఏమని పిలుచుకుంటున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఈ సస్పెన్స్ ఎక్కువైపోవడంతో ఏకంగా కరీనా ఫ్యామిలీలో ఎవరు కలిసినా(సోషల్‌ మీడియాలో) అడగడం స్టార్ట్ చేశారు వారు అభిమానులు. ఈ ప్రశ్నల తాకిడికి భరించ లేక కరీనా తండ్రి రణ్‌ధీర్‌ కపూర్‌ ఓపెన్‌ అయిపోయాడు. సైఫ్‌, కరీనా తమ రెండో కుమారుడికి పెట్టుకున్న పేరేంటో రివీల్‌ చేశాడు. 

రెండో కుమారుడిని వాల్లు `జెహ్‌` అని పిలుచుకుంటున్నారట. అదే పేరుగా నిర్ణయించారట. గత వారమే పేరుని ఫైనల్‌ చేసినట్టు రణ్‌ ధీర్‌ కపూర్‌ వెల్లడించారు. దీంతో సైఫ్‌,కరీనా ఫ్యామిలీ ఖుషీ అవుతున్నారు. పేరు భలే ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడీ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ, ట్రెండ్‌ చేస్తున్నారు. కాగా 2012లో సైఫ్‌, కరీనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ 2016, డిసెంబర్‌ 20న జన్మించాడు. రెండో కుమారుడు ఫిబ్రవరిలో జన్మించిన విషయం తెలిసిందే. అయితే రెండో కుమారుడిని ఇప్పటికే పరిచయం చేసింది కరీనా. కొద్ది కొద్దిగా ఇంట్రడక్షన్‌ ఇస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం కరీనా `లాల్‌సింగ్‌ చద్దా`లో ఆమీర్‌ ఖాన్‌తో నటిస్తుంది. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకుందని సమాచారం. మరోవైపు తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రాసింది కరీనా. `ప్రెగ్నెన్సీ బైబిల్‌` పేరుతో దీన్ని ఇటీవలే విడుదల చేసింది. గర్భం దాల్చిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలు, అనుభూతులను ఇందులో పొందుపర్చినట్టు చెప్పింది కరీనా. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?