‘ఆచార్య’ లేటెస్ట్ అప్డేట్, చరణ్ పై సోలో సీన్స్

Surya Prakash   | Asianet News
Published : Jul 10, 2021, 07:26 AM IST
‘ఆచార్య’ లేటెస్ట్ అప్డేట్, చరణ్ పై సోలో సీన్స్

సారాంశం

 ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభించారు. నేడు మెగాస్టార్ తోపాటు మిగిలిన వారు కూడా సెట్స్ లో అడుగు పెట్టారు. శరవేగంగా మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కరోనాతో ఆగిన ఈ మూవీ షూటింగ్ తిరిగి రీసెంట్ గా ప్రారంభమైంది. చిరంజీవి కూడా షూట్‌‌‌‌లో జాయినయ్యారు. పదిహేను రోజుల పాటు కంటిన్యుయస్‌‌‌‌గా జరిగే ఈ షెడ్యూల్‌‌‌‌తో సినిమా పూర్తి కానుంది. రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌ కూడా ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ ..జనంతో కలిసి ఉండే సీన్స్ షూట్ చేస్తున్నారు. అలాగే ఓ ఫైట్ సీన్ ని కూడా రామ్ చరణ్ పై తీయనున్నారు. ఈ షెడ్యూల్ లో ఎక్కువ భాగం రామ్ చరణ్ పై సోలో సీన్స్ తో ఉండబోతోందని తెలుస్తోంది. 

ఇక ఈ  సినిమాలో చరణ్ నటిస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ హైప్ క్రియేట్ చేసింది.  కొరటాల ఆచార్య సినిమా కోసం ఓ సాలిడ్ స్టోరీని ఎంచుకున్నారని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసే కొరటాల ఈ సినిమా కోసం కూడా అలాంటి కథనే సిద్ధం చేశారు. ఇక ఈ సినిమాలో చరణ్ చిరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. 

ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం కోకాపేట లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు.  శరవేగంగా మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  దసరాకి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..