అల్లు శిరీష్ మెడకు గాయం.. ఏం జరిగిందంటే?

Surya Prakash   | Asianet News
Published : Jul 10, 2021, 08:01 AM ISTUpdated : Jul 10, 2021, 08:02 AM IST
అల్లు శిరీష్ మెడకు గాయం.. ఏం జరిగిందంటే?

సారాంశం

 యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ గాయపడ్డాడు. ఈ విషయం ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.  అయితే ఆయన గాయపడింది సినిమా షూటింగ్‌లో కాదు, వర్కవుట్‌ చేసే సమయంలో! ఆ వివరాలు ఏమిటో చూద్దాం...

ఈ మధ్య శిరీష్‌ ఫిట్‌నెస్‌ మీద బాగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటిలాగే వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు."ఇది ఫ్యాషన్‌ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది" అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫొటో షేర్‌ చేశాడు.  అభిమానులు అల్లు శిరీష్‌కి త్వరగా గాయం నయమవ్వాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం అల్లు శిరీష్ రాకేశ్‌ శశి దర్శకత్వంలో “ప్రేమ కాదంట” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. దీనికి ‘ప్రేమ కాదంట’ టైటిల్‌ ఖరారు చేసారు. అలాగే, రెండు ఫస్ట్‌ లుక్స్‌ విడుదల చేశారు. ‘‘ఈతరం ప్రేమకథా చిత్రమిది. వినూత్న కథలతో సినిమాలు చేసే అల్లు శిరీష్‌, మరో కొత్త తరహా చిత్రం చేస్తున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా దర్శకుడు రాకేశ్‌ శశి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌ లుక్స్‌కు విశేష స్పందన లభిస్తోంది’’ అని విజయ్‌ .ఎమ్‌ చెప్పారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంస్థలపై ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: బాబు, ధీరజ్‌ మొగిలినేని, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, అచ్చు రాజమణి.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..