అల్లు అర్జున్‌తో సల్మాన్‌ ఖాన్‌ హీరోయిన్‌ ఆటా పాటా..?

Published : Jan 16, 2021, 07:24 AM IST
అల్లు అర్జున్‌తో సల్మాన్‌ ఖాన్‌ హీరోయిన్‌ ఆటా పాటా..?

సారాంశం

ఎక్కువగా ముంబాయి ముద్దుగుమ్మలే తెలుగులో సందడి చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిత్రంలో బాలీవుడ్‌ భామని తీసుకురాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ తో రొమాన్స్ చేసిన హీరోయిన్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 

పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌  ఊపందుకోవడంతో ఇప్పుడు భాషా బేధం లేకుండా నటీనటులను తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్ల విషయంలో ఆ తేడా ఎప్పుడూ లేదు. ఎక్కువగా ముంబాయి ముద్దుగుమ్మలే తెలుగులో సందడి చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిత్రంలో బాలీవుడ్‌ భామని తీసుకురాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ తో రొమాన్స్ చేసిన హీరోయిన్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం అల్లుఅర్జున్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నాహీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనంతరం కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు బన్నీ. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం సయీ మంజ్రేకర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని కూడా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించబోతున్నారని, అందు కోసమే బాలీవుడ్‌ భామని లైన్‌లో  పెట్టారని టాక్‌. అయితే ఇప్పటికే సయీ మంజ్రేకర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ అడవి శేషుసరసన `మేజర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు బన్నీతోనూ ఆడిపాడబోతుందని చెప్పొచ్చు. సల్మాన్‌తో ఈ అమ్ముడు `దబాంగ్‌3`లో నటించింది. 

ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న `పుష్ప` చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన అన్యాయంగా ఎర్రచందనం స్మిగ్లింగ్‌లో ఇరుక్కుంటాడని, దాన్నుంచి బయటపడేందుకు, అందుకు కారకులపై ప్రతీకారం తీసుకోవడం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని టాక్‌. ఇందులో బన్నీ పాత్ర చాలా మాస్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన లుక్‌లు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?