పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ అధికారికంగా అలా సెట్ అయ్యింది!

Published : Jan 15, 2021, 06:35 PM IST
పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ అధికారికంగా అలా సెట్ అయ్యింది!

సారాంశం

అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ కి  స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం నేడు అధికారిక ప్రకటన చేశారు. దీనిపై గతంలోనే సమాచారం ఉన్నప్పటికీ నేడు అధికారికంగా ధృవీకరించారు. 

నిన్న విడుదలైన  వకీల్‌సాబ్ టీజర్ తో పవన్ కళ్యాణ్‌ అదరగొట్టారు. తన మార్కు పంచ్ లతో ఆయన చెలరేగిపోయారు. కాగా నేడు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ పవన్ నుండి వచ్చింది. రానాతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.  

కాగా ఈ మూవీ టీమ్ లోకి దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంటర్ అయ్యారు. అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ కి  స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం నేడు అధికారిక ప్రకటన చేశారు. దీనిపై గతంలోనే సమాచారం ఉన్నప్పటికీ నేడు అధికారికంగా ధృవీకరించారు. 

ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా... పవన్ సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?