కమెడీయన్‌ బుట్టలో పడుతున్న సాయిపల్లవి.. నిజమేనా?

Published : Jan 31, 2021, 11:16 AM IST
కమెడీయన్‌ బుట్టలో పడుతున్న సాయిపల్లవి.. నిజమేనా?

సారాంశం

సాయిపల్లవి.. పవన్‌-రానా హీరోలుగా రూపొందుతున్న `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రంలో హీరోయిన్‌గా, రానాకి జోడిగా కనిపించనుందని టాక్‌ వినిపిస్తుంది. సాయిపల్లవికి సంబంధించిన తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హాస్య నటుడి బుట్టలో పడబోతుందని అంటున్నారు.

సాయిపల్లవి `ఫిదా` తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుంది. ఇందులో నాగచైతన్యతో కలిసి `లవ్‌స్టోరి`లో నటిస్తుండగా, మరోవైపు రానాతో కలిసి `విరాటపర్వం` చేస్తుంది. ఇందులో ఆమె నక్సలైట్‌ అయిన రానాకి ప్రియురాలిగా, నక్సలైట్‌ సానుభూతి పరురాలుగా కనిపించనుంది. మరోవైపు నానితో కలిసి మరోసారి `శ్యామ్‌ సింగరాయ్‌`లో నటిస్తుంది. ఇప్పటికే `ఎంసీఏ`లో నటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు పవన్‌-రానా హీరోలుగా రూపొందుతున్న `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రంలో హీరోయిన్‌గా, రానాకి జోడిగా కనిపించనుందని టాక్‌ వినిపిస్తుంది. సాయిపల్లవికి సంబంధించిన తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హాస్య నటుడి బుట్టలో పడబోతుందని అంటున్నారు. తమిళ హాస్య నటుడు కాళీ వెంకట్‌ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. అయితే దీనిపై ఈ `ఫిదా` బ్యూటీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ సినిమాకి ఒప్పుకుంటే సాయిపల్లవి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.  కాళీ ఇటీవల సూర్య `ఆకాశమే నీ హద్దురా`, `మారి2` వంటి చిత్రాల్లో నటించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్