
సాయిపల్లవి బ్యాక్ టూ బ్యాక్ సందడి చేస్తుంది. ఇటీవల `విరాటపర్వం` చిత్రంతో మెప్పించిన ఆమె ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. ఆమె నటించిన `గార్గి` చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడలో ఈ సినిమాని జులై 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సాయిపల్లవి సైతం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సాయిపల్లవి మెయిన్ రోల్ చేశారు. ఓ మహిళ జర్నీని, ఆమె స్ట్రగుల్స్ ని ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. `96` ఫేమ్ గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని రవిచంద్రన్, రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జర్జ్ నిర్మించారు. తమిళంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు.
తెలుగులో లేడీ పవర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది సాయిపల్లవి. `శ్యామ్ సింగరాయ్` సినిమా టైమ్‌లో ఆమెకి ఈ ఇమేజ్ వచ్చింది. రష్మిక మందన్నా, శర్వానంద్ నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ఈవెంట్‌కి సాయిపల్లవి గెస్ట్ గా వెళ్లింది. ఆ ఈవెంట్ కి సుకుమార్ కూడా గెస్ట్ గా వచ్చారు. ఆయన సాయిపల్లవి పేరు చెప్పగానే అభిమానులు గట్టిగా అరిచారు. అరుపులతో మోతమోగించారు.
దీంతో సుకుమార్ `లేడీ పవర్ స్టార్` అయితే అని అనడంతో ఆమెకి ఆ ముద్ర పడిపోయింది. ఇప్పుడు కూడా సాయిపల్లవి స్టేజ్‌పైకి వచ్చిందంటే అభిమానులు హోరెత్తిస్తున్నారు. అంతేకాదు `విరాటపర్వం` సినిమా ఈవెంట్లలోనై లేడీ పవర్ స్టార్ అని టైటిల్ కార్డ్ లో వేయడం విశేషం. ఇటీవల `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్`, `విరాటపర్వం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది సాయిపల్లవి. `విరాటపర్వం` డిజప్పాయింట్ చేసినా, ఆమెకి మంచి పేరు, ప్రశంసలు దక్కడం విశేషం.