Mahesh Babu on Vikram: మీరు లెజెండ్ నా అర్హత సరిపోదు... విక్రమ్ మూవీ మహేష్ రియాక్షన్!

Published : Jul 02, 2022, 07:30 PM IST
Mahesh Babu on Vikram: మీరు లెజెండ్ నా అర్హత సరిపోదు... విక్రమ్ మూవీ మహేష్ రియాక్షన్!

సారాంశం

లేటెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ విక్రమ్ పై మహేష్ ప్రశంసలు కురిపించారు. కమల్ హాసన్ తో పాటు విక్రమ్ టీమ్ ని పొగుడుతూ వరుస ట్వీట్స్ వేశారు. మహేష్ ట్వీట్స్ నేపథ్యంలో కమల్, సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

కమల్ హాసన్ (Kamal Haasan)హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఏకంగా రూ. 400 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లతో సత్తా చాటింది. కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ సంచలన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన విక్రమ్ ఎవరూ ఊహించని హిట్ అందుకుంది. ఇక తెలుగులో  విక్రమ్ డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. రూ. 7 కోట్లకు కొంటే సుమారు రూ. 17 కోట్లకు పైగా షేర్ సాధించింది. కర్ణాటక, కేరళలో సైతం విక్రమ్ కొత్త రికార్డ్స్ నమోదు చేసింది. 

దర్శకుడు లోకేష్ (Lokesh Kanakaraj)ప్రతిభను క్రిటిక్స్, ప్రేక్షకులు ప్రత్యేకంగా పొగుడుతున్నారు. కమల్ హాసన్ మాజీ రా ఏజెంట్ రోల్ చేయగా, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు. సూర్య గెస్ట్ రోల్ చేయడం జరిగింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ స్వయంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ చూసిన మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విక్రమ్ టీం పై ఆయన ప్రశంసలు కురిపించారు. 

విక్రమ్ సినిమాను న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్, ఇండస్ట్రీ హిట్ గా మహేష్ వర్ణించారు. లోకేష్ కనకరాజ్ టాలెంట్ అమేజింగ్ అన్నారు. ఇక విక్రమ్ మూవీ రూపొందించడం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని అడిగి తెలుసుకొన్నాను, అద్భుతమని పించింది అన్నారు. అనంతరం ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటనను ప్రత్యేకంగా పొగిడారు. ఇక అనిరుధ్ బీజీఎం మరో స్థాయిలో ఉన్నట్లు వర్ణించారు. 

ఇక చివరిగా కమల్ హాసన్ గురించి మహేష్(Mahesh Babu) గొప్పగా కొనియాడారు. లెజెండ్ కమల్ హాసన్ నటన గురించే చెప్పే అర్హత నాకు లేదు. ఒక అభిమానిగా నేను విక్రమ్ మూవీ చూసి గొప్పగా ఫీల్ అయ్యాను. మీకు కంగ్రాట్స్ సర్ అంటూ మహేష్ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. మహేష్ విక్రమ్ మూవీపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కమల్, సూర్య అభిమానులు ఈ ట్వీట్స్ ని వైరల్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?