సాయిపల్లవి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కనాలనుకుందట కానీ.. టార్గెట్‌ చిరంజీవి

Published : Jun 10, 2022, 11:14 PM IST
సాయిపల్లవి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కనాలనుకుందట కానీ.. టార్గెట్‌ చిరంజీవి

సారాంశం

బలమైన పాత్రలతో వెండితెరపై మ్యాజిక్‌ చేస్తున్న సాయిపల్లవి అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటన, డాన్సులు ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆమె కమర్షియల్‌ పాత్రలకు దూరం. కమర్షియల్‌ హీరోయిన్‌గా, గ్లామర్‌ హీరోయిన్‌ అనే ముద్రకి దూరం. చిన్నదైనా, పెద్దదైనా ఆ సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉండాల్సిందే. ప్రాధాన్యత ఉండాల్సిందే. అలాంటి బలమైన పాత్రలతో వెండితెరపై మ్యాజిక్‌ చేస్తున్న సాయిపల్లవి అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది. 

తాజాగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలనుకుందట. `ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే` షోలో పాల్గొంది సాయిపల్లవి. తాజాగా విడుదలైన ప్రోమోలో తన మ్యారేజ్‌ గురించి, చిరంజీవిపై ఆసక్తి గురించి తెలిపింది. తాను తెలుగులో సినిమాలు చేయడం వల్ల ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడుతుందట. దీంతో తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని ఇంట్లో అమ్మానాన్న అడుగుతున్నారని తెలిపింది సాయిపల్లవి. 

హీరోయిన్‌ కాకముందు 23ఏళ్లకే మ్యారేజ్‌ అవుతుందని, 30ఏళ్లు వచ్చేసరికి నాకు ఇద్దరు పిల్లలుంటారని భావించిందట. అలా ప్లాన్‌ చేసుకున్నట్టు చెప్పింది సాయిపల్లవి. తనకు పుట్టపర్తి సాయిబాబా పేరు పెట్టారని, పాలని ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారని చెప్పింది. తనకు ఏదైనా నచ్చకపోతే ఆ పని చేయదల. ఆ రూట్‌లోనే తాను వెళ్లలని తెలిపింది.  సినిమా ఇండస్ట్రీ కనుక నచ్చకపోతే ఇందులోకి వచ్చేదాన్ని కాదని, చదువుపై దృష్టిపెట్టేదాన్ని అని తెలిపింది. పొట్టి బట్టలేసుకోవడం తప్పు అని తాను అననని, నన్ను వెండితెరపై ఆడియెన్స్ చూసే కోణంలో మార్పు వచ్చినప్పటినుంచి తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందట. 

ఈ సందర్భంగా చిరంజీవిని టార్గెట్‌ చేసింది సాయిపల్లవి. ఆయనపై డాన్సులంటే ఇష్టమని, ఆయనలోని గ్రేస్‌ మరెవ్వరిలోనూ ఉండదన్నారు. చిరంజీవి నటించిన `ముఠామేస్త్రి` చిత్రంలోని `ఓయిరబ్బా.. `అనే పాటకి డాన్సులేయడానికి చాలా సార్లు ప్రయత్నించినట్టు తెలిపింది. అలాగే `హిట్లర్‌` సినిమాలోని నడక కలిసిననవరాత్రి పాటలోని స్టెప్‌ కూడా చాలా ఇష్టమని తెలిపింది. చిరంజీవిలో గ్రేస్‌ హైలైట్‌ అని చెప్పింది. తాజాగా విడుదలైన ఈప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

ఇదిలా ఉంటేసాయిపల్లవి ఇప్పుడు `విరాటపర్వం`(Virataparvam) చిత్రంలో నటించింది. రానా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల రూపొందించారు. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి వరుసగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాని తన భుజాలపై వేసుకుని ప్రమోట్‌ చేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?