స్టార్ హీరోయిన్ సమంత - బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కలిసి నటించబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ నుంచి అఫిషియల్ అప్డేట్ అందింది. ఈ సందర్భంగా సమంతను కన్ఫమ్ చేస్తూ సూపర్ స్టైలిష్ లుక్ ను విడుదల చేశారు..
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ రూస్సో బ్రదర్స్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ "సిటాడెల్" (Citadel) సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లోనూ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ దర్శకులు రాజ్ మరియు డీకే (Raj & D.K) దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha), బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) కలిసి నటించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.
ఎప్పటి నుంచో ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమంత ఈ సిరీస్ నుంచి తప్పుకుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ తాజాగా అమెజాన్ సమంతను కన్ఫమ్ చేస్తూ సాలిడ్ అప్డేట్ ను అందించింది. ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ రోలింగ్ అవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సమంత స్టైలిష్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈరోజు సమంత షూటింగ్ లో పాల్గొన్నట్టు దర్శకులూ ట్వీట్ ర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్ లో సమంత లుక్ అదిరిపోయింది. ఇప్పటికే ‘యశోద’లో యాక్షన్ ఇరగదీసిన ఈ స్టార్ నటి ‘సిటాడెల్’ ఆధారంగా వస్తున్న సిరీస్ లోనూ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుందని అంటున్నారు. నెవర్ బిఫోర్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇక సమంత బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు.
వరుణ్ ధావన్ మెయిన్ రోల్ లో నటిస్తుండగగా.. సమంత కీ రోల్ ను పోషించనుంది. ఈ అప్డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సమంత ఈజ్ బ్యాక్ అంటున్నారు. మరోవైపు సమంత తెలుగులో ‘ఖుషీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఇక పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘శాకుంతలం’ ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతోంది.
Super excited to team up with this powerhouse once again! Welcome to the world of Citadel!
Now filming 🎬 pic.twitter.com/yuoigSDiTd