టాలీవుడ్‌ టాప్‌ సాంగ్స్ ల్లో `సారంగ దరియా`.. నెంబర్‌ వన్‌ ఏంటో తెలుసా?

Published : Apr 06, 2021, 02:18 PM IST
టాలీవుడ్‌ టాప్‌ సాంగ్స్ ల్లో `సారంగ దరియా`.. నెంబర్‌ వన్‌ ఏంటో తెలుసా?

సారాంశం

`సారంగ దరియా` పాట సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఇది అత్యంత వేగంగా వంద మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకున్న పాటగా సౌత్‌లోనే రికార్డ్ సృష్టించింది. లిరికల్‌ సాంగ్‌ విభాగంలో ఈ ఘనత సాధించింది. తాజాగా ఇది టాలీవుడ్‌ టాప్‌ 15 సాంగ్స్ జాబితాలో చేరింది.

సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన `లవ్‌ స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` పాట సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఇది అత్యంత వేగంగా వంద మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకున్న పాటగా సౌత్‌లోనే రికార్డ్ సృష్టించింది. లిరికల్‌ సాంగ్‌ విభాగంలో ఈ ఘనత సాధించింది. తాజాగా ఇది టాలీవుడ్‌ టాప్‌ 15 సాంగ్స్ జాబితాలో చేరింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలై వంద మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సాధించిన పాటల జాబితాలో `సారంగ దరియా` చేరింది. వంద మిలియన్స్ క్లబ్‌లో చేసింది.

ఇందులో మొదటి స్థానంలో అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని `బుట్టబొమ్మ` సాంగ్‌ నిలవడం విశేషం. ఇది 575 మిలియన్స్ వ్యూస్‌తో టాప్‌లో ఉంది. టాప్‌ 2లో కూడా ఈ చిత్రంలోని `రాములో రాముల ` పాట నిలవడం విశేషం. దీనికి 353 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. వీటిలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `లవ్‌స్టోరి` చిత్రంలో `సారంగ దరియా` పాట 101 మిలియన్‌ వ్యూస్‌తో 14వ స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ వివరాలను ఆదిత్య మూజిక్‌ సంస్థ విడుదల చేసింది. 

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై 100 మిలియ‌న్లు పైన వ్యూస్ ద‌క్కించుకున్న పాటలు..

అల‌వైకుంఠ‌పురంలో - బుట్ట‌బొమ్మ - 575 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో - రాములో రాముల - 353 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో - సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (లిరిక‌ల్ సాంగ్) - 227 మిలియన్లు
అల‌వైకుంఠ‌పురంలో - సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (ఫుల్ సాంగ్) - 173 మిలియ‌న్లు
ఫిదా - వ‌చ్చిందే - 295 మిలియ‌న్లు
ఉప్పెన - నీ క‌ళ్లు నీలి స‌ముద్రం - 204 మిలియ‌న్లు
డీజే - సీటిమార్ - 202 మిలియ‌న్లు
ఛ‌లో - చూసి చూడంగానే - 169 మిల‌యిన్లు
ఎమ్ సి ఏ - ఏవండోయ్ నాని గారు - 118 మిలియ‌న్లు
గీత గోవిందం - ఇంకేం ఇంకేం కావ‌లే (వీడియో ఎడిట్ వెర్ష‌న్) - 115 మిలియ‌న్లు
గీత‌గోవిందం - ఇంకేం ఇంకేం కావ‌లే (లిరిక‌ల్) - 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం - వ‌చ్చింద‌మ్మ - 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం - ఏంటి ఏంటి - 102 మిలియ‌న్లు
ల‌వ్ స్టోరీ - సారంగ‌దరియా - 101 మిలియ‌న్లు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి