అల్లు అర్జున్‌ కోసం నలుగురు దర్శకులు.. చిరంజీవిని ఫాలో అవుతున్నారా?

Published : Apr 06, 2021, 01:46 PM IST
అల్లు అర్జున్‌ కోసం నలుగురు దర్శకులు.. చిరంజీవిని ఫాలో అవుతున్నారా?

సారాంశం

అల్లు అర్జున్‌ స్పెషల్‌ బర్త్ డే సీడీపీ కోసం నలుగురు దర్శకులు ముందుకు రావడం విశేషం. సుకుమార్‌, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, మారుతి కలిసి ఒకేసారి ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు బన్నీ బర్త్ డే సీడీపీని రిలీజ్‌ చేయబోతున్నారు.

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు ఈ నెల 8న. దీంతో ఆయన బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్‌ సీడీపీ ప్లాన్‌ చేస్తున్నారు. దీన్ని భారీగా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ బర్త్ డే సీడీపీని నేడు(మంగళవారం) విడుదల చేయబోతున్నారు. ఈ స్పెషల్‌ బర్త్ డే సీడీపీ కోసం నలుగురు దర్శకులు ముందుకు రావడం విశేషం. సుకుమార్‌, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, మారుతి కలిసి ఒకేసారి ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు బన్నీ బర్త్ డే సీడీపీని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ గురువారం రోజున ఆయన తన 38వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి బన్నీకి, ఆయన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. టీజర్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక బర్త్ డే సందర్భంగా రేపు(ఏప్రిల్‌7)న సాయంత్రం విడుదల చేయబోతున్నారు. దీన్ని ఓ ఈవెంట్ గా రిలీజ్‌ చేసేందుకు యూనిట్‌ ప్లాన్‌ చేయడం విశేషం. సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మాలీవుడ్‌ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే `పుష్ప` చిత్రంలో పుష్పరాజ్‌ పాత్ర టీజర్‌ని ఓ ఈవెంట్‌గా విడుదల చేయడం ఇప్పుడు ఆసక్తిరంగా మారింది. ఎందుకంటే చిరంజీవి పుట్టిన రోజు ముందు రోజు ఓ ఈవెంట్‌ని నిర్వహించడం సాధారణంగా జరుగుతుంది. ఈ సారి రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా కూడా బర్త్ డే సెలబ్రేషన్‌తో ఈవెంట్‌ని నిర్వహించారు. అలాగే బన్నీ కూడా ఈవెంట్‌ని ప్లాన్‌ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. చెర్రీ, బన్నీ.. ఇద్దరు బర్త్ డే సెలబ్రేషన్స్ విషయంలో చిరంజీవిని ఫాలో అవుతున్నారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఏదేమైనా మెగా అభిమానులంటే సెలబ్రేషన్స్ ని ఇష్టపడతారు. బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకోవడంలో తప్పేమి లేదని మెగా అభిమానుల మాట. మరి బన్నీ సెలబ్రేషన్‌ ఈ సారికేనా, లేక ప్రతి ఏడాది చేస్తారా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి