లిప్ లాక్ సీన్స్ వల్లే.. కథ బాగున్నా క్రేజీ హీరో సినిమాకి సాయి పల్లవి దూరం!

Published : Jul 16, 2019, 09:18 PM IST
లిప్ లాక్ సీన్స్ వల్లే.. కథ బాగున్నా క్రేజీ హీరో సినిమాకి సాయి పల్లవి దూరం!

సారాంశం

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరోయిన్ రష్మిక కాదట. సాయి పల్లవి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

త్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుంటారు. నటనలో ప్రతిభ అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ సాయి పల్లవి అలా కాదు. నటన, చలాకీతనంతో కుర్రకారుని కట్టిపడేసింది. తెలుగులో సాయి పల్లవి ఫిదా చిత్రం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సాయి పల్లవి సిద్ధపడుతుంది కానీ అందాల ఆరబోతకు, ముద్దు సన్నివేశాలకు ఈ మలయాళీ హీరోయిన్ దూరం. ఈ విషయాన్ని సాయి పల్లవి గతంలోనే తెలిపింది. నా సినిమాలు నా కుటుంబసభ్యులతో కలసి చూసే విధంగా ఉండాలి. అందుకే ముద్దు సీన్లలో నటించను అని సాయి పల్లవి తెలిపింది. 

తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం కోసం ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంచుకున్నారట. సాయి పల్లవికి కూడా కథ నచ్చింది. కానీ లిప్ లాక్ సీన్స్ లో నటించాల్సి ఉండడంతో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని సాయిపల్లవి రిజెక్ట్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటిస్తోంది. టీజర్స్, ట్రైలర్ లో విజయ్, రష్మిక ముద్దు సీన్లు హాట్ టాపిక్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి