సాయి పల్లవి.. ఐరెన్ లెగ్?

Published : Jun 05, 2019, 08:30 AM IST
సాయి పల్లవి.. ఐరెన్ లెగ్?

సారాంశం

. సౌత్ లో అమ్మడు మంచి క్రేజ్ దక్కించుకోవడంతో కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ అందాయి. అయితే సాయి పల్లవి కెరీర్ లో మొదటిసారి ఐరెన్ లెగ్ అనే టాక్ ను ఎదుర్కొనక తప్పలేదు. 

ఫిదా సినిమాతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ హిట్టందుకొన్న బ్యూటీ సాయి పల్లవి. మలయాళం మొదటి సినిమా ప్రేమమ్ కూడా మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. సౌత్ లో అమ్మడు మంచి క్రేజ్ దక్కించుకోవడంతో కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ అందాయి. అయితే సాయి పల్లవి కెరీర్ లో మొదటిసారి ఐరెన్ లెగ్ అనే టాక్ ను ఎదుర్కొనక తప్పలేదు. 

ఆమె చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మొదటి సినిమా దియా అలాగే ధనుష్ తో చేసిన మారి2 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ గా సూర్యతో చేసిన NGK కూడా ప్లాప్ బాటలో నడుస్తోంది. ఫైనల్ గా అమ్మడు ఈ అపజయంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. తెలుగులో కూడా ఫిదా బ్యూటీ కెరీర్ నామమాత్రంగానే ఉంది. 

శర్వాతో చేసిన పడి పడి లేచే మనసు డిజాస్టర్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి,. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వీరాటపర్వం. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు. మరి ఈ సినిమాతో అయినా సాయి పల్లవి సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి