సాయితేజ్, దేవకట్టా చిత్రం టైటిల్ అదే?

Surya Prakash   | Asianet News
Published : Oct 26, 2020, 07:01 PM IST
సాయితేజ్, దేవకట్టా చిత్రం టైటిల్ అదే?

సారాంశం

  సాయితేజ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌ నటించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.  డైరక్టర్ దేవకట్టాతో కలిసి డిస్కస్ చేస్తున్న ఫొటోను కూడా సాయితేజ్ ఆమధ్య విడుదల చేశాడు. 

దేవాకట్టా దర్శకత్వంలో  సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కొత్త సినిమా ఆరంభమైన సంగతి తెలిసిందే.  సాయితేజ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌ నటించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.  డైరక్టర్ దేవకట్టాతో కలిసి డిస్కస్ చేస్తున్న ఫొటోను కూడా సాయితేజ్ ఆమధ్య విడుదల చేశాడు. ఇక ఈ చిత్రం టైటిల్ గురించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. 

వాస్తవానికి  ఈ సినిమా టైటిల్ ను దసరా సందర్భంగా నిన్ననే ప్రకటించాలని అనుకుని డిజైన్ రెడీ చేసారట. కానీ లాస్ట్ మినిట్ లో ఇంతకన్నా బెటర్ టైటిల్ వస్తుందేమో చూద్దామని ఆగిపోయారు. ప్రస్తుతానికైతే ‘రిపబ్లిక్’ ను వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేసింది యూనిట్. ఇక ఈ సినిమా ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా రాబోతోంది . తన కెరీర్ లో సాయితేజ్ చేస్తున్న పొలిటికల్ బేస్డ్ మూవీ ఇదే.  ఈ సినిమాకు రీరికార్డింగ్ చాలా ముఖ్యంట. అందుకే రీరికార్డింగ్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ ..ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది.

గతేడాది విడుదలైన ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తెరకెక్కి రిలీజ్ కు రెడీ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌