సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) లేటెస్ట్ ఫిల్మ్ ‘విరూపాక్ష’. చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడులైంది. థ్రిల్, మిస్టరీ అంశాలతో ఆకట్టుకుంటోంది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - హీరోయిన్ సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ చిత్రానికి కార్తీ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
‘విరూపాక్ష’ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ఓ ఫారెస్ట్ ప్రాంతానికి 15 ఏండ్ల తర్వాత తిరిగి వచ్చిన మహిళ, ఆ తర్వాత వరుసగా హత్యలు. దీని వెనకున్న కారణం ఏంటీ? ఆ సమస్యను పరిష్కరించేందుకు విరూపాక్షగా సాయి ధరమ్ ఏం చేశారనేది ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుటుంది. ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక సాయి ధరమ్ తేజ్ రెండేండ్ల తర్వాత వెండితెరపై అలరించబోతున్నారు. చివరిగా ‘రిపబ్లిక్’తో ఫర్వాలేదనిపించాడు. బైక్ యాక్సిడెంట్ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో మళ్లీ Virupakshaతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ అదిరిపోగా.. తాజాగా ట్రైలర్ మరింతగా ఆసక్తిని పెంచేసింది. పైగా చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వాయిస్ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా బాధ్యతలు చూస్తున్నారు. కాగా బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Witness a man's Quest, Fight & his becoming of 👁️💪's OUT NOW 👇
- https://t.co/Y5bmPe2Utd pic.twitter.com/AGkVu2Dqdw