సాయిధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్.. పోలీసుల విచారణలో తేలింది ఇదే!

pratap reddy   | Asianet News
Published : Sep 12, 2021, 08:36 AM IST
సాయిధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్.. పోలీసుల విచారణలో తేలింది ఇదే!

సారాంశం

ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఎంత త్వరగా కోలుకుంటాడో అని అభిమానులు, కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది. 

ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఎంత త్వరగా కోలుకుంటాడో అని అభిమానులు, కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది. శుక్రవారం సాయంత్రం సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. 

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో వైద్యుల బృందం తేజుకి చికిత్స అందిస్తున్నారు.సాయిధరమ్ తేజ్ అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ వాడాడని వార్తలు వస్తున్నాయి.కానీ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన బైక్ సెకండ్ హ్యాండ్ అని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఎల్బీ నగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి వద్ద తేజు ఈ బైక్ కొన్నాడట. బైక్ కి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కానట్లు తెలుస్తోంది. దీనితో పోలీసులు అనిల్ కుమార్ ని కూడా పిలిచి విచారిస్తున్నారు. 

గతంలో ఈ బైక్ కు ఓవర్ స్పీడ్ కారణంగా పర్వతాపూర్ వద్ద చలానా వేశామని పోలీసులు అన్నారు. ఇటీవలే తేజు కుటుంబ సభ్యులు ఆ చలానా చెల్లించారని తెలిసింది. ఇక ప్రమాద సమయంలో తేజు 78 కిమీ వేగంతో బైక్ నడిపాడని డిసిపి స్పష్టం చేశారు. ఆటోని తప్పించబోవడంతో స్కిడ్ అయి కిందపడ్డాడని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే