పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొద్దిసేపటి కింద సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ టీజర్ చూశారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. ఇందుకు సుప్రీమ్ హీరో భావోద్వేగంగా కృతజ్ఞతలు తెలిపారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) లేటెస్ట్ ఫిల్మ్ ‘విరూపాక్ష’. చిత్రానికి కార్తీ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా యూనిట్ ప్రారంభించడం విశేషం.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం Virupaksha Teaserను విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్ర టీజర్ ను ఈరోజు చూశారు. యూనిట్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సాయి ధరమ్ తేజ్ నూ అభినందించారు. ఇందుకు సుప్రీమ్ హీరో తన మామ పవర్ స్టార్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. టీజర్ చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా చాలా ఆక్తికరమైన నోట్ రాశారు.
‘ఇంకేమీ అడగలేను. విరూపాక్ష నాకు చాలా కీలకమైన అడుగు. నా గురువు కళ్యాణ్ గారి ఆశీస్సులు, ఆయన చెప్పిన మంచి ఇలాంటి క్షణాన్ని ప్రారంభించడం ఒక వేడుక. కళ్యాణ్ మామా మీ ప్రేమకు, ప్రశంసలకు మరియు ఎల్లప్పుడూ మీరు నా కోసం నిలబడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక టీజర్ మార్చి 1న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
చివరిగా ‘రిపబ్లిక్’తో అలరించారు సాయి ధరమ్ తేజ్. ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు బైక్ యాక్సిడెంట్ కు గురవడంతో పవన్ కళ్యాణ్ హాజరై అండగా నిలిచిన విషయం తెలిసిందే. బైక్ ప్రమాదం తర్వాత సుప్రీమ్ హీరో నుంచి వస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఎన్టీఆర్ కూడా చిత్రానికి వాయిస్ అందించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మామ పవన్ కళ్యాణ్ తోనూ ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో సాయి ధరమ్ తేజ్ నటిస్తుండటం విశేషం. రీసెంట్ గానే చిత్రం ప్రారంభమైంది.
Can't ask for anything more ❤️ is a crucial step for me and starting off a moment like this with my Guruji Garu's blessings and kind words is a celebration.
Thank you Kalyan Mama for your love, appreciation & always being there for me. pic.twitter.com/o17XhJKiIF