`సత్య` గా సర్ఫైజ్ ఇస్తున్న సాయి తేజ్, ఈ రోజే రిలీజ్

Published : Aug 07, 2023, 01:34 PM IST
  `సత్య` గా సర్ఫైజ్ ఇస్తున్న  సాయి తేజ్, ఈ రోజే రిలీజ్

సారాంశం

 ఈ మ్యూజిక్ వీడియోలో తేజ్ తో పాటు కలర్స్ స్వాతి నటిస్తోంది. ఈ మ్యూజిక్ వీడియోని ఈ రోజు సాయింత్రం...


రీసెంట్ గా తన మామ పవన్ తో కలిసి బ్రో గా పలరించారు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. గత కొద్ది రోజులుగా ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజిగా ఉన్న ఆయన తాజాగా సత్య గా పలకరించటానికి రంగం సిద్దం చేసుకున్నారు.   తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ లో నవీన్ కృష్ణ ఒకరు. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. ఇతను కూజా  హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. నందిని నర్సింగ్ హోమ్, రెండు జళ్ల సీత లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నవీన్ డైరెక్టర్ గా మారాడు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో `సత్య` అనే మ్యూజిక్ వీడియోలో తేజ్ నటిస్తున్నాడు. ఈ మ్యూజిక్ వీడియోకు నవీన్ కృష్ణ అండ్ టీమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మ్యూజిక్ వీడియోలో తేజ్ తో పాటు కలర్స్ స్వాతి నటిస్తోంది. ఈ మ్యూజిక్ వీడియోని ఈ రోజు సాయింత్రం 6.03  నిముషాలకు  విడుదల చేస్తున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో  మ్యూజిక్ వీడియో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ఎంతోమంది భారతీయులకు నివాళిగా ఈ సాంగ్ రిలీజ్ కానుంది. మంచి కాన్సెప్ట్ కావడంతో పాటు నవీన్ కోసం కూడా తేజ్ ఈ మ్యూజిక్ వీడియోలో భాగమయ్యినట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్ లో తేజ్ ను స్వాతి గట్టిగా హత్తుకొని ఉండడం కొద్దిగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.   మరి ఈ సాంగ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమా టైటిల్‌  'గంజా శంకర్‌' అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు గంజా శంకర్ అని, ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ నుండి ప్రేరణ పొందిందని సమాచారం.  ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా