పేరెంట్స్ జాగ్రత్త.. సోషల్ మీడియాలో మృగాలున్నారు.. సాయిధరమ్‌ తేజ్‌ సంచలన పోస్ట్..

Published : Jul 07, 2024, 06:30 PM IST
పేరెంట్స్ జాగ్రత్త.. సోషల్ మీడియాలో మృగాలున్నారు.. సాయిధరమ్‌ తేజ్‌ సంచలన పోస్ట్..

సారాంశం

సోషల్ మీడియాలో మృగాలున్నారంటూ హీరో సాయిధరమ్‌ తేజ్‌ సంచలన పోస్ట్ పెట్టారు. ఓ షాకింగ్‌ వీడియోని షేర్‌ చేశారు. దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం కూడా స్పందించడం విశేషం.   

యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌.. ఇటీవల సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. చాలా విషయాలపై ఆయన స్పందిస్తున్నారు. సామాజిక అంశాల విషయంలో ఆయన చాలా యాక్టివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. యాక్సిడెంట్‌ తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ చాలా మారిపోయారు. ఆరోగ్యం, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్‌కి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఏకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం కూడా స్పందించాల్సి వచ్చింది. 

ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ చెబుతూ, చిన్నపిల్లలతో కూడిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు పేరెంట్స్ జాగ్రత్త వహించాలని, ఒకటి రెండు సార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని తెలిపారు. సోషల్‌ మీడియాలో ఫన్‌ పేరుతో కొందరు చేస్తున్న పిచ్చి చేష్టలను పోస్ట్ చేస్తూ మండిపడ్డారు సాయిధరమ్‌ తేజ్‌. సోషల్‌ మీడియా చాలా ప్రమాదకరంగా మారిపోయిందని, క్రూరంగా తయారవుతుందని చెప్పారు. 

`పేరెంట్స్ దయజేసి చాలా జగ్రత్తగా ఉండండి, సామాజిక మాధ్యమాలను నియంత్రించడం చాలా కష్టంగా మారింది. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని నా అభ్యర్థన. సోషల్‌ మీడియాలో ఉండే జంతువులను ప్రమాదకరంగా మార్చకండి. కొంత మంది చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు. అవి మిమ్మల్ని ఎంతగానో బాధపెడతాయి. మీ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం` అంటూ ఓ సంచలన పోస్ట్ చేశారు సాయిధరమ్‌ తేజ్‌. 

అంతేకాదు కొద్ది సేపు తర్వాత మరో పోస్ట్ తో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు.  ఇందులో ఫన్‌ పేరుతో కొందరు చేసిన పిచ్చి చేష్టలను సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తావించారు. ఇందులో వీడియో షేర్‌ చేస్తూ, ఇది భయంకరమైనది, అసహ్యకరమైనది. ఫన్‌ అండ్‌ డ్యాంక్‌ అని పిలవబడే మారువేషంలో పిల్లలపై దుర్వినియోగం చేయడం చాలా ఎక్కువగా ఉపయోగించబడే సామాజిక వేదికలో ఇలాంటి రాక్షసులు గుర్తించబడరు` అని మరో పోస్ట్ పెట్టారు. 

పిల్లల భద్రత ఈ సమయంలో చాలా అవసరం అని చెబుతూ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, లోకేష్‌లను ట్యాగ్‌ చేశారు సాయిధరమ్‌ తేజ్‌. భవిష్యత్‌లో ఇలాంటి భయంకరమైన చర్యలను అరికట్టేందుకు అసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు సాయితేజ్‌. దీంతో దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. 

ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు ధన్యవాదాలు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత. సోషల్‌ మీడియాలో పిల్లల దుర్వినియోగం, దోపీడిని నిరోధించడానికి మా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మన పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్‌ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దాం` అని తెలిపారు డిప్యూటీ సీఎం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన