వెరైటీగా ఉందే: సాయి ధరమ్ తేజ్‘చిత్రలహరి’ టీజర్

Published : Mar 13, 2019, 09:52 AM IST
వెరైటీగా ఉందే: సాయి ధరమ్ తేజ్‘చిత్రలహరి’ టీజర్

సారాంశం

సాయిధరమ్‌ తేజ్‌  హీరోగా ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సినిమా  ‘చిత్రలహరి’.

సాయిధరమ్‌ తేజ్‌  హీరోగా ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సినిమా  ‘చిత్రలహరి’.ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించి అందులో భాగంగా ఈ రోజు ఉదయం  టీజర్ ని విడుదల చేసారు.

తమ సినిమా ‘‘చిత్రలహరి’లోని పాత్రలోని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు.

ఇక టైటిల్ లాజిక్ ఏమిటంటే...చిత్ర... ఓ అమ్మాయి! లహరి... మరో అమ్మాయి! ఇద్దరి పేరు కలిపి చదివితే... ‘చిత్రలహరి’...ఆ ఇద్దరూ హీరో జీవితంలో ప్రవేశించాక ఎలా ఉంటుందనేది కథ! 

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!