Latest Videos

మామ మంత్రిగా భాధ్యతలు స్వీకారం, అల్లుడు సైలెంట్ గా సినిమా లాంచ్

By Surya PrakashFirst Published Jun 20, 2024, 2:01 PM IST
Highlights

ఈరోజు అమరావతిలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే రోజు సాయి ధరం తేజ్ .....


ఇప్పుడందరూ పీరియడ్ సినిమాలు చేస్తున్నారు. కాంటపరరీ కథలు పెద్దగా నచ్చుతున్నట్లు లేదు. హీరోలు టేస్ట్ గమనించే దర్శక,నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే సాయి తేజు కొత్త సినిమా ఈ రోజే లాంచ్ చేసారు. అదీ పీరియడ్ సినిమానే అని తెలుస్తోంది. అయితే డైరక్టర్ కొత్త కుర్రాడు రోహిత్.  నిర్మాత రీసెంట్ గా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన నిరంజన్ రెడ్డి.   ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కే ఈ సినిమాకు రీసెంట్ గానే  స్టోరీ ఫైనలైజ్ చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

 వాస్తవానికి ఈ సినిమా కన్నా ముందే  ‘గాంజా శంకర్’ అనే సినిమాను ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్టు రకరకాల కారణాలతో ఆగిపోయింది. దాంతో నాలుగైదు కధలు విన్నా ఏదీ నచ్చలేదు. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తను చేసిన చిత్రం ప్రతిష్టాత్మకంగా ఉండాలని గ్యాప్ వస్తుందని తెలిసినా ఆగారు. ఈ క్రమంలో  తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభం అయింది.  

మరో విశేషం ఏమిటంటే ఈ రోజే అమరావతిలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే రోజు సాయి ధరం తేజ్ సినిమా ప్రారంభించడం గమనార్హం. బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంటున్నారు. నిజమే అయితే సాయి తేజకు ఇది భారీ బడ్జెట్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని అంటున్నారు.  యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ మేరకు అఫీషియల్ ప్రకటన త్వరలో చేసే అవకాశం ఉంది.   కథా నేపథ్యం 1940 కాలంలో వుంటుందని, యూనిట్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. 

click me!