'ప్రతిరోజు పండగే'నంటున్న మెగాహీరో!

Published : Jun 24, 2019, 01:05 PM IST
'ప్రతిరోజు పండగే'నంటున్న మెగాహీరో!

సారాంశం

మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. 

మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా రాశిఖన్నా కనిపించనుంది.

అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమా మొదలైందని సాయి ధరం తేజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ తేజు ఇటీవల 'చిత్రలహరి'తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. మారుతీతో తో చేయబోయే తన కొత్త సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. మారుతి కెరీర్ కి కూడా ఈ సినిమా ఎంతో కీలకం. తనదైన స్టైల్ లో కామెడీ, కమర్షియల్ యాంగిల్ లో సినిమాను రూపొందిస్తున్నాడు. 

 

 

PREV
click me!

Recommended Stories

Lockdown : ఓటీటీలోకి లాక్‌డౌన్.. అనుపమా పరమేశ్వరన్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ - రష్మిక నుంచి విరాట్ - అనుష్క వరకు.. దేశంలో అత్యంత ఖరీదైన 5 పెళ్లిళ్లు