'బుర్రకథ' ట్రైలర్..!

Published : Jun 24, 2019, 12:48 PM IST
'బుర్రకథ' ట్రైలర్..!

సారాంశం

యువ హీరో ఆది సాయికుమార్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమా 'బుర్రకథ'. డైమండ్ రత్నంబాబు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 

యువ హీరో ఆది సాయికుమార్ ద్విపాత్రాభినయం చేస్తోన్న సినిమా 'బుర్రకథ'. డైమండ్ రత్నంబాబు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. 'రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు.. కృష్ణుడి శత్రువు కంసుడు.. కానీ నా శత్రువు నాతో ఉన్నాడు' అంటూ ఆది చెబుతోన్న డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 

ఇందులో ఆది... అభి, రామ్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. అభి అల్లరిచిల్లరిగా తిరిగా కుర్రాడి పాత్రలో కనిపిస్తుంటే.. రామ్ మాత్రం భక్తి, సన్యాసం అనే తిరిగే క్యారెక్టర్. ట్రైలర్ చివర్లో కమెడియన్ పృధ్వీతో 'సాహో' సినిమాలో డైలాగ్ స్పూఫ్ చేయించారు. జూన్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా