ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. డెబ్యూ హీరోగా ఉప్పెన చిత్రంతో వైష్ణవ్ తేజ్ అనేక రికార్డులు అందుకున్నాడు. నేడు వైష్ణవ్ తేజ్ బర్త్ డే.
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. డెబ్యూ హీరోగా ఉప్పెన చిత్రంతో వైష్ణవ్ తేజ్ అనేక రికార్డులు అందుకున్నాడు. నేడు వైష్ణవ్ తేజ్ బర్త్ డే. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ కి తన సోదరుడు సాయిధరమ్ తేజ్ బర్త్ డే విషెస్ తెలిపాడు.
తన తమ్ముడు గురించి తేజు చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'నా ప్రియమైన వైషు బాబు హ్యాపీ బర్త్ డే. గత ఏడాది నీ డెబ్యూ చిత్రం విజయం సాధించడంతో చాలా సంతోషాన్నిచ్చింది. ఇక ఏడాది చివర్లో నువ్వు మన ఫ్యామిలీ అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను ఆసుపత్రి బెడ్ పై నువ్వు చూడాల్సి రావడం బాధాకరమే. నువ్వు అన్నయ్య అని పిలిచినా నేను లేచే పరిస్థితిలో లేను. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బాధని దిగమింగుతూనే స్ట్రాంగ్ గా నిలబడ్డావు.
నేను కోలుకుని ఇంటికి వచ్చినప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూశాను. నేను నిన్ను చూసి గర్వపడుతున్నా తమ్ముడూ' అంటూ తేజు సోషల్ మీడియాలో ఎమోషల్ పోస్ట్ పెట్టాడు.
గత ఏడాది తేజు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మెగా ఫ్యామిలీ, అభిమానులు మొత్తం షాక్ కి గురయ్యారు. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ తేజు హెల్మెంట్ ధరించడం వల్ల కోలుకున్నాడు. తన స్పోర్ట్స్ బైక్ పై వెళుతున్న తేజు అనుకోని విధంగా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
happy birthday babu… love you ❤️ pic.twitter.com/eEiLr2JgqV
— Sai Dharam Tej (@IamSaiDharamTej)