
పవర్ స్టార్ అంటే ఎందుకంత ఇష్టం? అనే ప్రశ్నకు ప్రతి ఒక్క అభిమాని ఒక్కో విధంగా సమాధానం చెబుతూ ఉంటారు. ఫైనల్ అందరూ చెప్పే కామన్ ఆన్సర్ పవర్ స్టార్ మంచి మనస్తత్వం. సహాయపడే గుణమున్న పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానులను గెలుచుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో ఆయన్ను అందరితో పోటీపడి ప్రేమించే వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ఒకరు.
అలాగే పవన్ కి కూడా మేనల్లుడిపై ప్రేమ ఎక్కువే. రీసెంట్ గా పాలిటిక్స్ నుంచి కాస్త బయటపడ్డ పవన్ హైదరాబాద్ కు వచ్చి రాగానే చిత్రలహరి సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రశంసించాడు. అయితే పవన్ ని సాయి అందరికంటే ఎక్కువ ఇష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ,ముఖ్యంగా పవన్ సాయికి ఒక గాడ్ ఫాదర్ లా మారినట్లు అర్ధమవుతోంది.
చిన్నప్పటి నుంచి పవన్ ఎక్కువగా సాయిని ప్రేమగా చూసుకునేవారట. ఇష్టమైన బొమ్మలు కొనివ్వడం అలాగే లైఫ్ గురించి మంచి చెడ్డలు చెప్పడం. చివరికి యాక్టింగ్ కెరీర్ మొదలవ్వడానికి కూడా పవన్ సాయికి స్ఫూర్తినిచ్చాడు. ఇండస్ట్రీకి రకాముందు అవసరమైనప్పుడు పవన్ బైక్ ను పర్సనల్ లైఫ్ కి సాయి వాడుకునేవాడట. సినిమాల్లోకి రావడానికి మొదట సలహా ఇచ్చింది కూడా పవర్ స్టారే అని సాయి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.