జూ.ఎన్టీఆర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు..సునిశిత్ ఇక మారడా.. నీకు చావేరా అంటూ ఫ్యాన్స్ వార్నింగ్

Published : May 17, 2023, 06:19 PM IST
జూ.ఎన్టీఆర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు..సునిశిత్ ఇక మారడా.. నీకు చావేరా అంటూ ఫ్యాన్స్ వార్నింగ్

సారాంశం

శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ ఇటీవల రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ పొందాడు.

శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ ఇటీవల రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ పొందాడు. తనకి హీరోయిన్లతో చాలా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అంటూ గతంలో సునిశిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.   

అయితే అతడి కామెంట్స్ కి స్పందించే వారి కంటే నవ్వుకునే వారే ఎక్కువ. కాబట్టి అతడి వీడియోలు యూట్యూబ్ లో వైరల్ అవుతూ వచ్చాయి. టాలీవుడ్ లో తనకి తెలియని విషయం లేదని.. తనతో ప్రేమలో పడని హీరోయిన్ లేదని సునిశిత్ చేసే కామెంట్స్ ని ఎదో పిచ్చివాగుడు అన్నట్లుగా నెటిజన్లు చూస్తూ వచ్చారు. 

సునిశిత్ కామెంట్స్ బాగా వైరల్ అవుతుండడంతో యూట్యూబ్ ఛానల్స్ కూడా అతడికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించాయి. అతడు మరింత సంచలన వ్యాఖ్యలు చేసేలా రెచ్చగొట్టి ఇంటర్వ్యూలు చేశాయి. సునిశిత్ ఇటీవల రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి కామెంట్స్ చేయడంతో.. చరణ్ ఫ్యాన్స్ అతడిని చుట్టుముట్టి చితకబాదారు. ఏ హీరో గురించి, నటి గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి.. ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపారు. 

అయినప్పటికీ సునిశిత్ కి బుద్ది వచ్చినట్లు లేదు. తాజాగా సునిశిత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అసభ్యంగా కామెంట్స్ చేశాడు. ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.  జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో కదా.. కానీ ఎన్టీఆర్ అశ్లీల చిత్రాల్లో నటించారు అంటూ సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 

 

జూ. ఎన్టీఆర్ గురించి ఈ విషయం టాలీవుడ్ లో ఎవ్వరూ చెప్పరు.. సునిశిత్ అనే హీరో తప్ప అంటూ తన గురించి తానూ బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తాను ఎంతగా దిగజారుతున్నానో, చిక్కుల్లో పడుతున్నానో సునిశిత్ కి అర్థం అవుతున్నట్లు లేదు. రాంచరణ్ ఫ్యాన్స్ తర్వాత చావు దెబ్బలు తిన్నాక కూడా ఇలా మాట్లాడడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఎన్టీఆర్ అభిమానులైతే సునిశిత్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. సునిశిత్ కి పాడె రెడీగా ఉంచండి.. కంఫర్మ్ గా నీకు చావేరా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రాంచరణ్ ఫ్యాన్స్ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం రెడీగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు