
సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని చాలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడు. కానీ ఆస్థాయి విజయం దక్కలేదు. దాదాపు 6 ఏళ్ల తర్వాత బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తో విజయ్ ఆంటోని ముందుకు వస్తున్నాడు. మే 19న బిచ్చగాడు 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉండడంతో విజయ్ ఆంటోని అండ్ బిచ్చగాడు టీం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బజ్ పెంచుతున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా విజయ్ ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిచ్చగాడు ఒక సిరీస్ లాగా కొనసాగబోతోందని వార్తలు వస్తున్నాయి. బిచ్చగాడు సిరీస్ లో మీరు కాకుండా హీరోగా ఎవరు చేస్తే బావుంటుందని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా విజయ్ ఆంటోని స్పందించారు.
బిచ్చగాడు చిత్రం మహేష్ బాబుకి బాగా సెట్ అవుతుంది. ఒక వేళ నేను నటించకుంటే సరైన హావ భావాలు, ఎమోషన్స్ పండించాలంటే మహేష్ బాబు బాగా సెట్ అవుతారు. తమిళంలో విజయ్, అజిత్ బెటర్ ఆప్షన్స్ అని విజయ్ ఆంటోని అన్నారు. బిచ్చగాడు తర్వాత మరో హిట్ లేదు. కాబట్టి బిచ్చగాడు సీక్వెల్ తో వస్తున్నారా అని ప్రశ్నించగా.. అదికూడా ఒక కారణమే.. కానీ బిచ్చగాడు 2కి అద్భుతమైన కథ లభించింది అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన బిచ్చగాడు 2 తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ ఆంటోని ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతీ సినిమా విషయంలో మేం కూడా భయపడుతుంటారు. కానీ మా డిస్ట్రిబ్యూటర్లు వీరమనాయుడు, ఉషా పిక్చర్స్ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో నాకు ఎలాంటి భయం లేదు. భాషా శ్రీ గౌరవ్ గారు నా ఆలోచనలన్నీ తెలుగులో చక్కగా చెబుతుంటారు. నన్ను ప్రమాదం నుంచి కాపాడిన కావ్యకు థాంక్స్. నా తప్పు వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. అన్ని రకాలుగా ఎంతో అండగా ఉంటున్న నా భార్య ఫాతిమాకు థాంక్స్. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రెండో పార్ట్‌లోనూ ఉంటాయి. బిచ్చగాడు మొదటి పార్ట్ నచ్చిన అందరికీ కూడా రెండో పార్ట్ నచ్చుతుంది. మే 19న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది' అని అన్నారు.