Shabaash Mithu Trailer: శబాష్ మిథు ట్రైలర్... సచిన్, గంగూలీ ఏమన్నారంటే!

Published : Jun 21, 2022, 10:09 AM IST
Shabaash Mithu Trailer: శబాష్ మిథు ట్రైలర్... సచిన్, గంగూలీ ఏమన్నారంటే!

సారాంశం

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శబాష్ మిథు ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ గుండెకు హత్తుకునేలా ఉందన్న ఆయన శబాష్ మిథు టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు.

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది శబాష్ మిథు. 23 ఏళ్ల లాంగ్ కెరీర్ కలిగిన మిథాలి అనేక అరుదైన మైలు రాళ్లు అందుకున్నారు. 10000 వన్ డే ఇంటర్నేషనల్ పరుగులు పూర్తి చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డులకు ఎక్కారు. మిథాలీ రాజ్ గా తాప్సి పన్ను నటిస్తున్నారు. ఈ మూవీ జులై 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన సచిన్ టెండూల్కర్ స్పందించారు. 

సచిన్ (Sachin Tendulkar) ట్విట్టర్ వేదికగా... శబాష్ మిథు ట్రైలర్ (Shabaash Mithu Traile) గుండెలను హత్తుకునేలా ఉంది. మిథాలీ రాజ్ కోట్ల మంది వాళ్ళ కలలను నెరవేర్చుకోవడంలో స్పూర్తిగా నిలిచారు. ఈ సినిమా చూడాలని నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను, అంటూ తెలియజేశారు. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సైతం ట్రైలర్ పై స్పందించారు. శభాష్ మిథు.. ఈ అమ్మాయి అతనే మార్చేశారు, అంటూ ట్వీట్ లో పొందిపరిచారు. 

సచిన్, గంగూలీ వంటి స్టార్ క్రికెటర్స్ మద్దతుతో శబాష్ మిథు చిత్రానికి మంచి ప్రచారం దక్కుతుంది. శభాష్ మిథు చిత్రం కోసం తాప్సి (Taapsee Pannu)చాలా కష్టపడ్డారు. జిమ్ లో గంటల తరబడి శ్రమించి మిథాలీ రాజ్ లుక్ సాధించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ ని తలపించడం కోసం శిక్షణ తీసుకున్నారు. శభాష్ మిథు చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్