
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సాహో’ సినిమా . యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 30 న విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది టీమ్.
పోస్టర్, టీజర్‌లు చూస్తుంటే ‘సాహో’లో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు కేక పెట్టిస్తాయని అర్థమవుతోంది. ఈ యాక్షన్‌ను ఫ్యాన్స్ కూడా ఫీల్ అవ్వండి అంటూ ‘సాహో’ గేమ్‌ను తయారు చేసింది చిత్ర యూనిట్. ‘సాహో: ది గేమ్’పేరుతో ఓ గేమ్‌ను రెడీ చేస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. అయితే టీమ్, టీజర్ల విషయంలో కాపీ వివాదం కొనితెచ్చుకున్న టీమ్ ఈ గేమ్ నిమిత్తం వదిలిన పోస్టర్ విషయంలో కాపీ అనిపించుకుంది. స్పీల్ బర్గ్ డైరక్ట్ చేసిన 'Ready Player One' అనే సినిమా పోస్టర్ ని యాజటీజ్ దించేసారు. దాంతో ఈ విషయంలోనూ ట్రోల్స్ తప్పటం లేదు.
సుజిత్ సినిమాకు దర్శకత్వం వహించన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేశ్ విలన్ పాత్ర పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. రీసెంట్ గా సినిమాలోని ‘సైకో సయ్యా’ అనే పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.