ప్రభాస్ దెబ్బకు సైడైపోతున్న హీరోలు.. అజిత్ ఏం చేస్తున్నాడంటే!

Published : Jun 16, 2019, 05:34 PM IST
ప్రభాస్ దెబ్బకు సైడైపోతున్న హీరోలు.. అజిత్ ఏం చేస్తున్నాడంటే!

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ ఇండియన్ యాక్షన్ ఫిలిం అంటూ ఇప్పటికే తెగ ట్రెండ్ అయిపోతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ ఇండియన్ యాక్షన్ ఫిలిం అంటూ ఇప్పటికే తెగ ట్రెండ్ అయిపోతోంది. నార్త్ అభిమానులు కూడా సాహో కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

సాహో లాంటి భారీ చిత్రం విడుదలవుతున్నప్పుడు దాని సమీపంలో విడుదలయ్యే సినిమాలకు ఎఫెక్ట్ తప్పదు. సాహో చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళ హీరోలు సాహూ ఎఫెక్ట్ తో తమ చిత్రాలని వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

బోనికపూర్ నిర్మాతగా అజిత్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఆగష్టు 9న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆగష్టు 15న సాహో విడుదల కానుండడంతో వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. దీనితో ఈ చిత్రాన్ని సాహో కంటే కొన్ని వారాల ముందే జూలైలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్య కాప్పాన్ చిత్రాన్ని కూడా వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్