అఫీషియల్: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సాహో

Published : Aug 23, 2019, 05:53 PM IST
అఫీషియల్: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సాహో

సారాంశం

ఫైనల్ గా సాహో సెన్సార్ పనులను ముగించుకుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో యూవీ క్రియేషన్స్ గత కొన్ని రోజుల నుంచి వీలైనంత త్వరగా సాహో సెన్సార్ పనులను ఫినిష్ చేయాలనీ శ్రమిస్తోంది. ఎట్టకేలకు సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ తో U/A సర్టిఫికెట్ ను అందుకుంది.   

ఈ బిగ్ బడ్జెట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ శ్రద్ధ కపూర్ తో కలిసి రియాలిటీ షోల్లో కూడా పాల్గొంటున్నాడు.   172 నిమిషాల నిడివితో ఉన్న సాహో సెన్సార్ యూనిట్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రిలీజ్ పనుల్లో ఉన్న యూవీ క్రియేషన్స్ దేశ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంది.   సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు మరి సినిమా ప్రభాస్ అభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆగస్ట్ 30న సాహో తెలుగు హిందీ తమిళ్ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే