దర్శకురాలిగా స్టార్ హీరో డాటర్

Published : Aug 23, 2019, 05:35 PM ISTUpdated : Aug 23, 2019, 05:37 PM IST
దర్శకురాలిగా స్టార్ హీరో డాటర్

సారాంశం

అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ దర్శకురాలిగా మారడానికి ప్లాన్ రెడీ చేసుకుంది. గత కొంత కాలంగా అమ్మడు యాక్టింగ్ పై ద్రుష్టి పెట్టె అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. యాక్టింగ్ తనకు ఇష్టం లేదని తన కెరీర్ తన ఇష్టానికే వదిలేసినట్లు గతంలో ఆమె సన్నిహితులు వివరణ ఇచ్చారు

అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ దర్శకురాలిగా మారడానికి ప్లాన్ రెడీ చేసుకుంది. గత కొంత కాలంగా అమ్మడు యాక్టింగ్ పై ద్రుష్టి పెట్టె అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. యాక్టింగ్ తనకు ఇష్టం లేదని తన కెరీర్ తన ఇష్టానికే వదిలేసినట్లు గతంలో ఆమె సన్నిహితులు వివరణ ఇచ్చారు. అయితే మొత్తానికి ఇరా ఖాన్ దర్శకత్వం శాఖలోకి వచ్చేసింది. 

థియేటర్ ప్రొడక్షన్ లో యూరిపిడెస్ మెడియా అనే ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ ని రెడీ చేసుకుంది. ఇప్పటికే కొన్ని వర్క్స్ షాప్స్ నిర్వహించిన బేబీ ఇక ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ  ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎట్టకేలకు సినీ పరిశ్రమకు అమీర్ కూతురిని దూరంగా ఉంచుతున్నారని వచ్చిన వార్తలు అబద్దమని తేలిపోయింది. 

మరి దర్శకురాలిగా ఇరా ఖాన్ భవిష్యత్తులో తండ్రిని కూడా డైరెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చందా అనే ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే