విషాదంః `సాహో` నటుడు బిక్రమ్‌ జీత్‌ కరోనాతో కన్నుమూత..

Published : May 01, 2021, 06:05 PM IST
విషాదంః `సాహో` నటుడు బిక్రమ్‌ జీత్‌ కరోనాతో కన్నుమూత..

సారాంశం

కరోనాతో మరో నటుడు తుదిశ్వాస విడిచారు. `సాహో`లో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన నటుడు బిక్రమ్‌ జీత్‌ కన్వర్‌పాల్‌ శనివారం మృతి చెందారు. 

కరోనా విలయతాండవానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాతో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా మరో నటుడు తుదిశ్వాస విడిచారు. `సాహో`లో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన నటుడు బిక్రమ్‌ జీత్‌ కన్వర్‌పాల్‌ శనివారం మృతి చెందారు. ఈ విషయాన్ని దర్శకుడు అశోక్‌ పండిత్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. మెయిన్‌ స్ట్రీమ్‌ నటుడిగా రాణిస్తున్న బిక్రమ్‌ జీత్‌ కన్వర్‌పాల్‌ మృతితో బాలీవుడ్‌ వర్గాలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నాయి. 

దర్శకుడు అశోక్‌ పండిత్‌ స్పందిస్తూ, `అతి చిన్న వయసులోనే బిక్రమ్‌ జీత్‌ మనందరిని విడిచి వెళ్లిపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది` అంటూ భావోద్యేగానికి లోనయ్యారు.  రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌ బిక్రమ్‌ 2003లో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. హిందీలో ఎన్నో సినిమాలు, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌ల్లో నటించి ఆకట్టుకున్నాడు. అద్బుతమైన టాలెంటెడ్‌తో యాక్టర్‌గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో రామ్‌చరణ్‌ `జంజీర్`‌, రానా `ఘాజీ అటాక్`‌, ప్రభాస్‌ `సాహో`  వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. హిందీలో ఆయన `పేజ్‌ 3`, `కార్పొరేట్‌`, `డాన్‌`, `హైజాక్‌`, `నాకౌట్‌`, `మర్డర్‌ 2`, `జోకర్‌`, `జబ్‌ తక్‌ హై జాన్‌`, `గ్రాండ్‌ మస్తీ`, `హర్రర్‌ స్టోరీ`, `హీరోయిన్‌`, `2 స్టేట్స్`, `అంజాన్‌`, `ప్రేమ రతన్‌ ధ్యాన్‌ పాయో` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన మరణ వార్త విని బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు తెలుగు నటీనటులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?