National Film Awards: కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన తమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు

Published : Jul 22, 2022, 05:00 PM IST
National Film Awards: కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన తమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు

సారాంశం

68వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో సౌత్ సినిమాలు సత్తా చాటాయి. తెలుగులో కలర్ ఫోటో, అల వైకుంఠపురములో చిత్రాలకి జాతీయ అవార్డులు దక్కాయి.

68వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో సౌత్ సినిమాలు సత్తా చాటాయి. తెలుగులో కలర్ ఫోటో, అల వైకుంఠపురములో చిత్రాలకి జాతీయ అవార్డులు దక్కాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

షెడ్యూల్ 8వ కాన్స్టిట్యూషన్ బెస్ట్ తెలుగు ఫిలిం క్యాటగిరిలో 'కలర్ ఫోటో' చిత్రం జాతీయ వార్డు కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో కమెడియన్ సుహాస్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. 

ఇక సంగీత దర్శకుడిగా సూపర్ సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. ఉత్తమ సంగీత దర్శకుడిగా(పాటలు) అల వైకుంఠపురములో చిత్రానికి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. బెస్ట్ బిజియం విభాగంలో సూర్య ఆకాశం నీ హద్దురా చిత్రానికి అవార్డు దక్కింది. 

అలా వైకుంఠపురములో సాంగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ దేనికదే సాటి అన్నట్లుగా ఉంటుంది. సామజవరగమన తో మొదలైన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. థమన్ ప్రతిభకి, కష్టానికి దక్కిన ప్రతిఫలం ఈ జాతీయ అవార్డు అనే చెప్పాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?