'RX100' క్రేజ్ ఇదీ!

Published : Aug 30, 2018, 05:43 PM ISTUpdated : Sep 09, 2018, 12:43 PM IST
'RX100' క్రేజ్ ఇదీ!

సారాంశం

చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'RX100'. రిలీజ్ సమయానికి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ మొదటిరోజు నుండే ఈ సినిమా వసూళ్ల పరంగా పుంజుకుంది

చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'RX100'. రిలీజ్ సమయానికి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ మొదటిరోజు నుండే ఈ సినిమా వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి పేరు దక్కింది.

ఈ సినిమా తరువాత వారికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకుంది. జులై 12న విడుదలైన ఈ సినిమా ఈరోజుకి 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని తన సత్తా చాటింది. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది.

నైజాంలో రూ.5 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ ఆరు థియేటర్లలో రన్ అవుతోంది. అలానే సీడెడ్ లో 7 థియేటర్లు, ఆంధ్రప్రదేశ్ లో 13 థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడు ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో ఆది పినిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్