RX100: ఇక్కడ 2 కోట్లైతే.. అక్కడ 35కోట్లు?

Published : Mar 27, 2019, 08:09 PM IST
RX100: ఇక్కడ 2 కోట్లైతే.. అక్కడ 35కోట్లు?

సారాంశం

  బాలీవుడ్ లో ఇటీవల సౌత్  సినిమాలకు మంచి డిమాండ్ పెరుగుతోంది అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుండడంతో బాలీవుడ్ దిగ్గజాలు పోటీ పడి మరి తెలుగు కథలను కొనేస్తున్నారు.

బాలీవుడ్ లో ఇటీవల సౌత్  సినిమాలకు మంచి డిమాండ్ పెరుగుతోంది అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుండడంతో బాలీవుడ్ దిగ్గజాలు పోటీ పడి మరి తెలుగు కథలను కొనేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కథను బాలీవుడ్ లో కొంచెం హై బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. 

సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి కథానాయకుడిగా తార హీరోయిన్ గా నటిస్తున్న ఆర్ఎక్స్ 100 రీమేక్ కథను బాలీవుడ్ లో 35 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సాజిద్ ఈ రీమేక్ కథకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మొదట సేమ్ టైటిల్ ను కంటిన్యూ చేద్దాం అనుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు టడప్ అనే కొత్త టైటిల్ ను సెట్ చేసింది. 

సినిమాను కొంచెం అర్బన్ స్టైల్ కి కన్వర్ట్ చేసి నార్త్ జనాల అభిరుచుకి తగ్గట్టుగా కథను మలిచినట్లు సమాచారం. తెలుగులో 2 కోట్లతో నిర్మించిన ఆ కథకు 12 కోట్ల లాభం వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో అదే కథ 35 కోట్లతో నిర్మిస్తుండడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు