గోపితో మరో సాహసం!

Published : Mar 27, 2019, 05:17 PM IST
గోపితో మరో సాహసం!

సారాంశం

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సాహసం తరువాత గోపి ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేదు. ఆ సినిమాను సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సాహసం తరువాత గోపి ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేదు. ఆ సినిమాను సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు సాహసం లాంటి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో గోపితో మరో సినిమాను నిర్మిస్తున్నారు ఈ సక్సెస్ ఫుల్ నిర్మాత. నేడు సినిమా పూజా కార్యక్రమాలతో చిత్ర యూనిట్ సెట్స్ పైకి వెళ్ళింది. కోలీవుడ్ లో సీనియర్ దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన బిను సుబ్రహ్మణ్యం ఈ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.   

గోపి క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని యాక్షన్ అంశాలనే కాకుండా కథలో కూడా దర్శకుడు కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం గోపి తిరు డైరెక్షన్ లో ఒక స్పై కథలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటు ఈ కొత్త దర్శకుడి సినిమా షూటింగ్ ను కూడా గోపి వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడు.  

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?