శాకుంతలం సినిమా నుంచి రిలీజ్ అయిన రుషివనంలోన సాంగ్, ప్రమోషన్లకు పదును పెట్టిన టీమ్

By Mahesh JujjuriFirst Published Jan 25, 2023, 10:38 PM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పౌరాణిక  సినిమా శాకుంతలం. రిలీజ్ కు ముస్తాబుతున్న ఈసినిమానుంచి వరుస అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మూవీ టీమ్. ఈక్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా రెండోవ పాటలను రిలీజ్ చేశారు. 
 

రిలీజ్ కు ముస్తాబుతుంది శాకుంతలం సినిమా. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. ఈక్రమంలోనే ట్రైలర్.. టీజర్లు సినిమాపై హైప్ పెంచగా.. రీసెంట్ గా ఈమూవీ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్.  తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌ను సిద్ శ్రీరామ్‌, చిన్మయి పాడారు. శ్రీమణి ఈ పాట రాశారు. శాకుంతలం నుంచి ఇప్పటికే విడుదలైన మల్లిక మల్లిక పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాన్‌ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

పురాణాల ఆధారంగా శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో శాకుంతలం తెరకెక్కింది.  టైటిల్ రోల్ లో సమంత నటిస్తుండగా.. సమంత జతగా.. మేయిల్ లీడ్ రోల్ లో మలయాళ  యంగ్ స్టార్  దేవ్ మోహన్ అలరించబోతున్నారు. ఈ సినిమాను  గుణశేఖర్  దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. అదితి బాలన్ మరో పాత్రలో కనిపించనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో చిత్రాన్నివిడుదల చేబోతున్నారు. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్  రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు.  

 

చిత్రంలో అదిరిపోయే గ్రాఫిక్ వర్క్ ఉండబోతోంది. వీఎఫ్ఎక్స్ తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం అందిస్తున్నారు. త్రీడీలోనూ తెరకెక్కబోతుండటం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సమంతో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషిలోనూ  నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుండంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం కోసం అభిమానులు ఎదురుచూస్తుున్నారు. 

click me!