హీరోయిన్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. సిగ్గుందా?

Published : Mar 25, 2019, 04:53 PM ISTUpdated : Mar 25, 2019, 04:54 PM IST
హీరోయిన్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. సిగ్గుందా?

సారాంశం

సాయి పల్లవిపై గత కొంత కాలంగా రూమర్స్ డోస్ బాగా పెరుగుతోంది. పండ్లున్న చెట్టుపైనే రాళ్ళూ పడతాయ్ అనే తరహాలో రౌడీ బేబీ స్టార్ రేంజ్ పెరగడంతో రూమర్స్ కూడా ఆ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైందని సౌత్ లో కొన్ని పరభాషా మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. 

దీంతో సాయి పల్లవి సన్నిహితులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఎన్ని రూమర్స్ వచ్చినా ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు కూడా గాలి వార్తలను అలానే వదిలేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ AL విజయ్ ను పెళ్లి చేసుకోవడానికి సాయి పల్లవి సిద్దమవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయ్. 

అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ కథనాలపై సీరియస్ గా కామెంట్ చేస్ట్సున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. కొంచెమైనా సిగ్గుందా అని కామెంట్ చేస్తున్నారు. సాయి పల్లవి అభిమానులు ఆగ్రహం వెనుక బలమైన కారణం ఒక్కటే.. డైరెక్టర్ విజయ్ ఇదివరకు అమలాపాల్ తో డేటింగ్ చేసి వివాహం చేసుకొని కొన్నాళ్ళకె విడిపోయాడు.

దీంతో ఈ రూమర్ లో ఎక్కువగా ఆ విషయం బాధిస్తోంది అని మలయాళం కుట్టి ఫ్యాన్స్ గుర్రుగా 'ఉన్నారట. సాయి పల్లవితో డైరెక్టర్ విజయ్ గత ఏడాది కణం అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు