జయలలిత బయోపిక్.. కంగనా ఘాటైన రేటు!

Published : Mar 25, 2019, 04:27 PM ISTUpdated : Mar 25, 2019, 04:28 PM IST
జయలలిత బయోపిక్.. కంగనా ఘాటైన రేటు!

సారాంశం

హీరోయిన్ అనే పదానికి సరికొత్త అర్దాన్ని చెబుతోన్న నటి కంగనా రనౌత్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక హీరోయిన్ హీరోల స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం అనేది నిజంగా పెద్ద మార్పనే చెప్పాలి. ఇండియాలోనే మొదటి సారిగా ఒక నటిగా తన రేటును 20 కోట్లను దాటించిన మొదటి మహిళ కంగనా. 

ఇప్పుడు తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం ఏకంగా 24 కోట్ల రెమ్యునరేషన్ ను అందుకోవడానికి సిద్దమయ్యింది. మణికర్ణిక సినిమాతో భారీ ఓపెనింగ్స్ ను అందుకున్న కంగనా నెక్ట్ కూడా బడా ప్రాజెక్టులతో హీరోలతో పోటీగా తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకోవాలని కష్టపడుతోంది. 

ఇప్పటికే 200 కోట్ల మార్కెట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న కంగనా తమిళనాడు తలైవి పాత్రలో నటించడానికి సన్నద్ధమవుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ AL విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి