రవితేజకు జంటగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా రవితేజ వరుస చిత్రాలు చేస్తున్నారు. ధమాకా మూవీతో పరాజయాల నుండి బయటపడ్డ రవితేజకు వరుసగా రెండు ప్లాప్స్ పడ్డాయి. రావణాసుర ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచింది. ఫిబ్రవరి 9న ఈగల్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
సంక్రాంతికి రావాల్సిన ఈగల్ థియేటర్స్ సమస్య కారణంగా ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఈగిల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా నెక్స్ట్ రవితేజ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన సప్త సాగరాలు దాటి మూవీలో రుక్మిణి హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమె అరంగేట్రమే రవితేజ వంటి స్టార్ తో అవుతుందట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
సాఫ్ట్ రోల్ లో మెప్పించిన రవితేజ పక్కన ఎలాంటి పాత్ర చేస్తుందో చూడాలి. ఇక అనుదీప్ కేవీ జాతిరత్నాలు మూవీతో భారీ హిట్ కొట్టాడు. అనంతరం శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ తెరకెక్కించాడు. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. రవితేజ హీరోగా తన మూడో చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇక రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు.